Amazon Great Summer Sale 2024 :ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ మరో మెగా సేల్‌కు సిద్ధమైంది. ఏటా వేసవిలో నిర్వహించే గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలను తాజాగా ప్రకటించింది. ఈ మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని స్పష్టం చేసింది. అయితే, ఈ బిగ్ సేల్ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. మరో ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా 'బిగ్ సేవింగ్ డేస్ సేల్' తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి మే 9 వరకు ఈ సేల్ జరగనుంది.
వారికి మే 1 నుంచే!
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మే 1 అర్థరాత్రి 12 తర్వాత నుంచే ఈ గ్రేట్ సమ్మర్ సేల్ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ సేల్‌లో అందించే డిస్కౌంట్స్, ఆఫర్స్, డీల్స్‌ను ప్రైమ్ సబ్స్క్రైబర్లు అందరికంటే ఒక రోజు ముందుగానే పొందవచ్చు.
బెస్ట్ ఆఫర్స్ ఇవే!
Amazon Great Summer Sale Offers :
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డు యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తారు.
- కొనుగోలుదారులకు ఈఎంఐ సౌకర్యం కూడా కల్పిస్తారు.
- ఈ సేల్ సమయంలో చేసే ఫస్ట్ ఆర్డర్‌పై ఫ్రీ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాదు వెల్‌కమ్ రివార్డ్ పేరిట 20 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తారు.
- స్మార్ట్‌వాచ్‌లు, పుస్తకాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తారు.
- అమెజాన్ అలెక్సా డివైజ్‌లు, ఫైర్‌టీవీ, కిండ్లే డివైజుల మీద ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయని సమాచారం.
- ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ, నార్జో, ఐకూ, పోకో, హానర్, టెక్నో లాంటి టాప్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
- అయితే వేటిపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ ఇంకా చెప్పలేదు. త్వరలోనే ఈ ఆఫర్స్ అండ్ డీల్స్ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ - భారీ ఆఫర్స్ & డీల్స్ - ఎప్పటి నుంచి అంటే? - Flipkart Big Saving Days 2024
2024 మే నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays