Timely Home Loan EMI Repayments :మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. కానీ అందరికీ ఆ కలను నెరవేర్చుకునే ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. అందుకే ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి హోమ్‌లోన్స్‌పై ఆధారపడుతుంటారు. హోమ్‌లోన్ మంజూరు కావడానికి మంచి క్రెడిట్‌స్కోర్‌తో పాటు, సరైన ధ్రువపత్రాలు ఉండాలి. ఈ గృహ రుణం ప్రక్రియ అంతా పూర్తి అయ్యి, లోన్ అప్రూవ్ అయ్యాక అతిపెద్ద బాధ్యత మొదలవుతుంది. అదే హోమ్‌లోన్ రీపేమెంట్. ప్రతినెలా కచ్చితంగా ఈఎంఐ కట్టాలి. ఒకవేళ ఈఎంఐలను సకాలంలో కట్టలేకపోతే, చాలా రకాల సమస్యలు వచ్చిపడతాయి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
5 Reasons You Must Pay Your Home Loan EMIs On Time :
1. పెనాల్టీ పడకుండా!
EMIలను ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకులు అదనపు ఛార్జీలను విధించవచ్చు. ఈ ఛార్జీలు మీకు భారంగా మారుతాయి. పైగా లోన్ రీపేమెంట్ ప్రక్రియను కష్టతరం చేస్తాయి. అందువల్ల ఈఎంఐలను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల జరిమానాలు, అదనపు రుసుముల నుంచి తప్పించుకోవచ్చు.
2. త్వరగా ఓనర్‌షిప్!
మీరు చెల్లించే ప్రతి ఈఎంఐతో ఇంటిని సొంతం చేసుకోవడంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తారు. కాలక్రమేణా ఇంటిపై పూర్తి హక్కులను పొందుతారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదిస్తుంది. తద్వారా ఇంటిని పూర్తిగా సొంతం చేసుకునే మీ లక్ష్యం త్వరగా నెరవేరదు.