New Car Delivery Checklist : మనలో చాలా మందికి కొత్త కారు కొనడం ఒక కల. అందుకే ఏరికోరి నచ్చిన కారును సెలక్ట్ చేసుకుంటారు. తీరా ఆ కారు డెలివరీ తీసుకున్నాక, అందులో ఏమైనా లోపాలు ఉంటే, అప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే, కారు డెలివరీకి ముందు 5 రకాల అంశాలను కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. Car Exterior Inspection : సాధారణంగా మనం మంచి డిజైన్, కలర్ ఉన్న కారునే కొనుక్కుంటాం. తీరా డెలివరీ తీసుకున్న తరువాత దీనిలో ఏమైనా లోపాలు ఉంటే, అప్పుడు బాధపడినా ఫలితం ఉండదు. అందుకే ముందుగానే కారు వెలుపలి భాగాన్ని (ఎక్స్‌టీరియర్) కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించాలి.
- బాడీ ప్యానెల్స్ :కొన్నిసార్లు కారుపై చొట్టలు, గీతలు లాంటివి ఉంటాయి. అలాగే బాడీ ప్యానెల్స్ మధ్య గ్యాప్స్ ఉంటాయి.
- పెయింట్ వర్క్ :కొన్ని సార్లు కార్ పెయింట్ సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే పెయింట్ ఓవర్ స్ప్రే అవ్వడం కానీ, లేదా పెయింట్ గ్యాప్స్ కానీ, పాయింట్ ఊడిపోవడం గానీ జరగవచ్చు.
- టైర్స్ : కారు టైర్స్, రిమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టైర్ల సైజ్, డెప్త్ సరిగ్గా ఉందో, లేదో చెక్ చేసుకోవాలి. పంక్చర్లు, పగుళ్లు లాంటి ఉన్నా, లేదా ఏదైనా తేడాగా ఉన్నా కచ్చితంగా డీలర్‌కు ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే కొంత మంది డీలర్లు టైర్లు మార్చేసే అవకాశం ఉంది. కనుక వాహనం చెక్ చేసేటప్పుడు కచ్చితంగా మీ ఫోన్‌తో కారును అన్ని వైపుల నుంచి ఫొటోలు తీసుకోవడం మంచిది. ఇది మీకు ఒక ప్రూఫ్‌గా పనిచేస్తుంది.
2. Car Interior Inspection : కారు లోపల అంతా బాగుంటేనే మీ ప్రయాణం హాయిగా, సాఫీగా కొనసాగుతుంది. కనుక కారు డెలివరీ తీసుకునే ముందు కచ్చితంగా కారు లోపలి భాగంలో అన్నీ సక్రమంగా ఉన్నాయో, లేదో చూసుకోవాలి.
- డ్యాష్ బోర్డ్ : కారులోపల డ్యాష్‌బోర్డ్‌ను కచ్చితంగా చూడాలి. ముఖ్యంగా వార్నింగ్ లైట్స్, గేజ్‌లు, డిస్‌ప్లే సిస్టమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.
- సీట్స్ :కారు సీట్లపై ఏమైనా మరకలు, చిరుగులు ఉన్నాయా? సీట్ల పొజిషన్ చక్కగా ఉందా, లేదా అనేది కూడా చూడాలి.
- ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ : ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో టెస్ట్ చేయాలి.
- క్లీన్లీనెస్ : కారు లోపలంతా శుభ్రంగా, ఎలాంటి దుర్వాసనలు లేకుండా చూసుకోవాలి.