తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.10 లక్షల్లోపు మంచి SUV కార్​ కొనాలా? త్వరలో లాంఛ్​ కానున్న బెస్ట్​-4 మోడల్స్ ఇవే! - SUVS UNDER 10 LAKH

హ్యుందాయ్, స్కోడా, మారుతి, కియా కంపెనీల నుంచి 12 నెలల్లో ఎస్​యూవీలు లాంఛ్ - ఫీచర్లు, ధరల వివరాలు మీ కోసం

Upcoming SUVs Under 10 Lakh
Upcoming SUVs Under 10 Lakh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2024, 4:56 PM IST

Upcoming SUVs Under 10 Lakh :కార్​ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. స్కోడా, హ్యుందాయ్, కియా, మారుతి సుజుకి కంపెనీలు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉన్న కాంపాక్ట్ ఎస్​యూవీలను రానున్న 12 నెలల్లో లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అలాగే ఈ కార్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

1. Skoda Kylaq :
స్కోడా కైలాక్ ఎస్​యూవీ 2025 మార్చిలో భారత మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కైలాక్ భాగాలు కూడా స్కోడా కుషాక్ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 1.0లీటర్ల 3 సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్, 115 పీఎస్ పవర్​ను, 178 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర వేరియంట్​ను బట్టి రూ.8.5 లక్షలు- రూ.15లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

2. New Hyundai Venue :
హ్యుందాయ్ వెన్యూ ఎస్​యూవీ సెకండ్ జెనరేషన్ 2025 మధ్యలో మార్కెట్లోకి రానుంది. ఫీచర్లు, డిజైన్లలో చాలా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. అయితే పాత మోడల్​ మాదిరిగానే దీని ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. హ్యుందాయ్ వెన్యూ ధర వేరియంట్‌ ఆధారంగా రూ.7.94 లక్షల నుంచి రూ.13.48 లక్షల వరకు ఉండనుంది.

3. Kia Syros :
కియా సిరోస్ 2025 మొదటి అర్ధభాగంలో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. కియా సిరోస్ కారు కియా సోనెట్ ఇంజిన్, ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. ఈ కారు అత్యాధునిక ఫీచర్లు, మంచి లుక్​తో ఉండనున్నట్లు సమాచారం. పెద్ద టచ్‌ స్క్రీన్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్వాన్స్​డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, సన్​ రూఫ్, మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. కియా సిరోస్ ప్రారంభ ధర రూ.6 లక్షలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

4. Maruti Suzuki Fronx Facelift :
మారుతి కంపెనీ నుంచి రానున్న మరో కొత్త మోడల్ ఎస్​యూవీ సుజుకి ఫ్రాంక్స్ ఫేస్ లిఫ్ట్. ఈ మోడల్ కారు 2025 మధ్యలో మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇది హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్​తో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు మంచి ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుందని సమాచారం. తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని తెలుస్తోంది. దీని ధర రూ.10 లక్షల లోపే ఉండనున్నట్లు అంచనా.

ABOUT THE AUTHOR

...view details