తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా? ఈ 10 టిప్స్ మీ కోసమే! - How To Save Money Fast - HOW TO SAVE MONEY FAST

10 Simple Hacks To Boost Your Savings : మీ సంపాదన చాలా తక్కువగా ఉందా? కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోలేకపోతున్నారా? డోంట్ వర్రీ. ఈ ఆర్టికల్‌లో చెప్పిన ఈ సింపుల్‌ టిప్స్ పాటిస్తే చాలు. మీ ఖర్చులు తగ్గి, పొదుపు పెరుగుతుంది.

tips to boost your savings
hacks to boost your savings (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 1:11 PM IST

10 Simple Hacks To Boost Your Savings : మనలో చాలా మందికి నెలవారీ సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. కానీ రోజువారీ ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భవిష్యత్‌ కోసం కొంతైనా పొదుపు చేయలేకపోతున్నామని తెగ బాధపడుతుంటారు. మరి మీరు కూడా ఇదే కోవలో ఉన్నారా? అయితే డోంట్ వర్రీ. కొన్ని సులువైన చిట్కాలతో మీ ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పెంచుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం రండి.

  1. మీ ఖర్చులను ఒక సారి ట్రాక్ చేయండి :దైనందిన అవసరాల కోసం మనం డబ్బు ఖర్చు పెట్టడం సహజమే. కానీ మనకు తెలియకుండానే చాలా అనవసరపు ఖర్చులు చేస్తుంటాం. ఇందుకే మీ నెలవారీ ఖర్చులు అన్నింటినీ ఒక సారి పరిశీలించి చూడండి. అందులో అనవసరమైన ఖర్చులు ఏమైనా ఉంటే, తరువాత నెల నుంచి వాటిని పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేయండి.
  2. సరైన బడ్జెట్ రూపొందించుకోండి :ముందుగానే నెలవారీ బడ్జెట్ రూపొందించుకోవడం వల్ల కచ్చితంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి వీలవుతుంది. అందుకే మీ అవసరాలు, సరదాలు కోసం కొంత మొత్తాన్ని కేటాయించుకోండి. మీ ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు, మదుపు చేయండి. ఈ విధంగా మీ బడ్జెట్‌ను చాలా రియలిస్టిక్‌గా, అవసరమైతే తగు మార్పులు, చేర్పులు చేసుకునే విధంగా రూపొందించుకోండి.
  3. ఇంట్లోనే వంట చేసుకోండి :నేటి కాలంలో ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లి ఫలహారాలు, భోజనాలు చేస్తున్నారు. కానీ దీని వల్ల మనకు తెలియకుండానే బోలెడు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే వంట చేసుకోవడం మంచిది. దీని వల్ల డబ్బు మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. డ్యూటీకి వెళ్లేటప్పుడు కచ్చితంగా లంఛ్ బాక్స్ తీసుకువెళ్లండి. దీని వల్ల మీ డబ్బులు భారీగా ఆదా అవుతాయి.
  4. ఒకేసారి కావాల్సినవన్నీ కొనుక్కోండి : కిరాణా దుకాణానికి వెళ్లి మీకు కావాల్సిన పదార్థాలను, సామానులకు ఒకేసారి తీసుకోవాలి. దీని వల్ల మీ ఖర్చులు బాగా తగ్గుతాయి.
  5. యుటిలిటీ ఖర్చులు తగ్గించుకోండి : చాలా మంది ఇంట్లో ఉన్న కరెంట్ బల్బులు, ఫ్యాన్లు, టీవీలను ఆపకుండా అలానే ఉంచుతారు. దీని వల్ల కరెంట్ బిల్లు విపరీతంగా వస్తుంది. కనుక ఇలాంటి ఎలక్ట్రానిక్స్ వినియోగాన్ని చాలా వరకు తగ్గించాలి. దీని వల్ల కూడా డబ్బు ఆదా అవుతుంది.
  6. స్మార్ట్‌గా షాపింగ్‌ చేయండి : చాలా మంది తమకు నచ్చిన దుస్తులను, వస్తువులను షాపింగ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు. మీకు అవసరమైనంత వరకు మాత్రమే వాటిని కొనాలి. అంతేకాదు ఏ వస్తువైనా కొనేముందు కచ్చితంగా వాటి ధరలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి. మంచి డిస్కౌంట్స్‌, కూపన్స్, ఆఫర్స్ ఉన్నప్పుడే వాటిని కొనుగోలు చేయాలి.
  7. సబ్‌స్క్రిప్షన్స్‌ తగ్గించుకోండి : ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత సబ్‌స్క్రిప్షన్స్ భారీగా పెరిగిపోయాయి. అందుకే మీరు ఎక్కువగా ఉపయోగించని ప్లాట్‌ఫామ్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఆపేయాలి. అవసరమైతే కుటుంబం మొత్తానికి సరిపోయే ఫ్యామిలీ ప్లాన్స్ తీసుకోవాలి. దీని వల్ల కూడా బోలెడు ఖర్చు తగ్గుతుంది.
  8. కాస్త వేచి ఉండండి :మీరు ఏదైనా వస్తువు కొనాలని అనుకుంటే, వెంటనే దానిని కొనేయకండి. ఒకటి, రెండు రోజులు కాస్త వేచి ఉండండి. దీని వల్ల కొనాలనే ఆత్రుత తగ్గుతుంది.
  9. ఉచితంగా దొరికే వాటిని వాడుకోండి : థియేటర్లకు, షాపింగ్ మాల్స్‌కు వెళితే, ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. అందుకే పూర్తి ఉచితంగా ఎంట్రీ ఇచ్చే పార్కులకు, గ్రంథాలయాలకు, ఆట స్థలాలకు వెళ్లండి. అలాగే ఫ్రీ ఈవెంట్లకు, బుక్ క్లబ్‌లకు, ఫెస్టివల్‌లకు అటెండ్ కండి. దీని వల్ల మీరు ఉచితంగా ఆనందాన్ని పొందవచ్చు. అనుకోవడానికి ఇది సిల్లీగా ఉన్నప్పటికీ, దీని వల్ల మానసిక ఆనందం పొందవచ్చు. చాలా అనవసరపు ఖర్చులు తగ్గించుకోవచ్చు.
  10. జీవిత లక్ష్యాలను నిర్దేశించుకోండి : మీ ఆర్థిక లక్ష్యాలను కచ్చితంగా నిర్దేశించుకోండి. కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. మీకు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు, మదుపు చేయండి. జీవిత, ఆరోగ్య బీమాలను తీసుకోండి. అప్పుడే భవిష్యత్‌లో మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది.

ఈ ఆర్టికల్‌లో చెప్పిన చాలా విషయాలు మనందరికీ తెలిసినవే. కానీ వాటిని మనం నిత్య జీవితంలో సరిగ్గా పాటించం. దీని వల్ల అనవసర ఖర్చులు చేసి, భవిష్యత్‌ కోసం పొదుపు, మదుపు చేయలేక బాధపడుతుంటాం. అందుకే ఈ ఆర్టికల్‌లో చెప్పిన చిట్కాలు పాటించి, మీ ఆర్థిక భవిష్యత్‌ను మీరే నిర్మించుకోండి. ఆల్‌ ది బెస్ట్‌!

ABOUT THE AUTHOR

...view details