తెలంగాణ

telangana

ETV Bharat / business

అపర కుబేరుడు ఎలాన్​ మస్క్ జీవితాన్ని మార్చిన టాప్​-10 బుక్స్ ఇవే! - Elon Musk Recommended Books

10 Books Recommended By Elon Musk : ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఈయన బిలీయనర్ గా ఎదగడంలో పుస్తకాలు కీలక పాత్ర పోషించాయి. అందుకే ఎలాన్ మస్క్ తప్పక చదవాల్సిన 10 పుస్తకాలను నేటి యువతీయువకులకు సిఫార్సు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 5:30 PM IST

elon musk recommended books
10 Books Recommended By Elon Musk

10 Books Recommended By Elon Musk : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంటే తెలియని వారుండరు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్​కు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావాలనే తన చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు మస్క్​కు కొన్ని పుస్తకాలు సాయపడ్డాయి. ఎలాన్​ మస్క్ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శకత్వం చేశాయి. వాటిలోని టాప్​-10 పుస్తకాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ది ఫౌండేషన్ సిరీస్
అమెరికాకు చెంది బయోకెమిస్ట్, రచయిత ఐజామ్ అసిమెవ్​ 'ది ఫౌండేషన్ సిరీస్' పేరిట సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు రాశారు. ఇందులో హ్యారీ సెల్డన్ అనే గణిత శాస్త్రవేత్త గెలాక్సీ భవిష్యత్​ను గణిత శాస్త్రం పరంగా అంచనా వేయడానికి ఒక పద్ధతిని ఎలా అభివృద్ధి చేశాడో వివరించాడు. ఈ పుస్తకం విజ్ఞాన శాస్త్రం విలువను తెలియజేస్తుంది. అంతేకాదు పురాతన కాలం నుంచి నేటి వరకు సమాజాలు ఎలా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది.

2. లార్డ్ ఆఫ్ ది రింగ్స్
ఫాంటసీ నవల 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌'ను జాన్ రొనాల్డ్ రీయుల్ టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం మనిషి ధైర్యం గురించి; మంచి- చెడుల మధ్య జరిగే సంఘర్షణ గురించి తెలిపే ఒక అద్భుతమైన కాల్పనిక కథ. 'ఈ లార్డ్ ఆఫ్​ ది రింగ్స్​, ఫౌండేషన్ సిరీస్​లు చెడుపై మంచి సాధించే విజయం గురించి తెలియజేస్తాయి. ఈ కథల్లోని హీరోలు దుష్ట శక్తుల నుంచి ప్రపంచాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం గురించి తెలియజేస్తుంటారు' అని ఎలాన్ మస్క్ అన్నారు.

3. ది మూన్ ఈజ్ ఎ హార్ష్ మిస్ట్రెస్
అమెరికన్ రచయిత రాబర్ట్‌ హీన్లీన్‌ ఈ పుస్తకాన్ని చాలా ఆసక్తిగా రాశారు. ఇందులోని కథ మొత్తం చంద్రుడిపై జరుగుతుంది. చంద్రునిపై ఒక కాలనీ ఉంటుంది. వీరు భూమి నుంచి స్వతంత్రం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఎంతో ఆసక్తి కలిగించే ఒక ఫిక్షన్ స్టోరీ.

4. స్టక్చర్స్​ ఆర్ వై థింగ్స్ డోంట్ ఫాల్
మెటిీరియల్ సైన్స్, బయోమెకానిక్స్ మార్గదర్శకుల్లో ఒకరైన జే.ఈ. గోర్డన్​ ఈ పుస్తకం రాశారు. ఇందులో నిర్మాణాల స్థిరత్వానికి అంతర్లీనంగా ఉన్న సైన్స్​, ఇంజినీరింగ్ టెక్నాలజీల గురించి తెలియజేశారు. ఎవరైనా స్ట్రక్చురల్ డిజైనింగ్​లో మంచి ప్రావీణ్యం సంపాదించాలని అనుకుంటే కచ్చితంగా ఈ పుస్తకం చదవాలని ఎలాన్ మస్క్ సూచిస్తుంటారు.

5. బెంజమిన్​ ఫ్రాంక్లిన్​ : యాన్​ అమెరికన్ లైఫ్
వాల్టర్ ఐజాక్​సన్ రాసిన పుస్తకం ఇది. ఇందులో ఫౌండేషన్ ఫాదర్​ ఆఫ్​ యునైటెడ్​ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర గురించి రాశారు. బెంజిమన్ ఫ్రాంక్లిన్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ప్రముఖ రచయిత, శాస్త్రవేత్త, ఆవిష్కర్త కూడా.

'బెంజమిన్ ఫ్రాంక్లిన్ తన సోదరుడి దగ్గర ఒక ప్రింటింగ్ షాపులో అప్రెంటీస్​గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత ఇంటి నుంచి పారిపోయాడు. తరువాత ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్తగా మారాడు. ఆ తరువాత ఒక శాస్త్రవేత్తగా, ఆవిష్కర్తగా ఘనవిజయాలు సాధించాడు. ఈ విధంగా ఏమీ లేకుండా తన జీవితాన్ని ప్రారంభించిన ఫ్రాంక్లిన్ అంచెలంచెలుగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు' అని మస్క్​ కొనియాడారు.

6. ఐన్​స్టైన్​ : హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్
ఈ పుస్తకాన్ని అమెరికన్ చరిత్రకారుడు, పాత్రికేయుడు వాల్టర్ ఐజాక్సన్ రచించారు. ఈ బుక్ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్​స్టైన్​ జీవిత చరిత్ర గురించి తెలుపుతుంది. ఐన్​స్టైన్ విప్లవాత్మక భౌతిక శాస్త్ర ఆవిష్కరణల గురించి తెలియజేస్తుంది.

7. జీరో టు వన్
జీరో టు వన్ పుస్తకాన్ని అమెరికన్ రచయిత, వ్యాపారవేత్త పీటర్ థీల్ రాశారు. ఇందులో కొత్త వ్యాపారాలను ప్రారంభించడం, లాభదాయకమైన వెంచర్​లను అభివృద్ధి చేయడం గురించి రచయిత రాశారు. అంతేకాదు వ్యాపార పోటీతత్వం, ఆవిష్కరణలు, వ్యాపార అభివృద్ధి వ్యూహాల గురించి చాలా వివరంగా రాశారు. ఆంత్రప్రెన్యూర్​గా జీవితాన్ని ప్రారంభించాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని ఎలాన్ మస్క్​ చెబుతుంటారు.

8. సూపర్ ఇంటెలిజెన్స్: పాత్స్, డేంజర్స్, స్ట్రాటజీస్
ఈ పుస్తకంలో స్వీడిష్ ఫిలాసఫర్​, రచయిత నిక్ బోస్ట్రోమ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాశారు. మానవాళికి ఏఐ వల్ల జరిగే మంచి చెడుల గురించి ఈ పుస్తకంలో చాలా వివరంగా రాశారు. పొందుపర్చారు.

9. ఇగ్నిషన్ : యాన్​ ఇన్​ఫార్మల్ హిస్టరీ ఆఫ్ లిక్విడ్ రాకెట్ ప్రొపెల్లంట్స్
ఈ పుస్తకాన్ని జాన్ డి.క్లార్క్ రచించారు. ఇది మానవులు అంతరిక్షంలోకి ప్రయాణించగలిగేలా రాకెట్ ప్రొపెల్లెంట్​లను ఎలా అభివృద్ధి చేశారో వివరిస్తుంది. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు రాకెట్లకు అవసరమైన ఇంధనాలను ఎలా ఉత్పత్తి చేశారనేది తెలియజేస్తుంది.

10. లైఫ్ 3.0
ఈ పుస్తకాన్ని స్వీడిష్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ టెగ్​మార్క్ రచించారు. లైఫ్ 3.0లో కృత్రిమ మేధస్సు గురించి రాశారు. ఇందులో కృత్రిమ మేధ వల్ల సమాజంలో లైఫ్​ 3.0 అనే కొత్త రకమైన జీవితం ఆవిర్భవించవచ్చని రచయిత పేర్కొన్నాడు. ఇది కూడా ఎలాన్ మస్క్​ను తీవ్రంగా ప్రభావితం చేసిన పుస్తకం.

Warren Buffett Investment Tips : లాభాల వర్షం కురిపించే.. వారన్​ బఫెట్​ 12 గోల్డన్ ఇన్వెస్ట్​మెంట్​ టిప్స్​ ఇవే!​

Big Bull Rakesh Jhunjhunwala : రూ.5 వేల నుంచి రూ.44 వేల కోట్ల సంపద సృష్టి.. ఇలా చేస్తే సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details