Youth Cycle Yatra To Ayodhya :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలక్రామ్ను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వివిధ మార్గాల్లో అయోధ్యకు చేరుకుంటూ రామయ్యను దర్శించుకుంటున్నారు. అయితే రాజస్థాన్‌లో ఉదయ్‌పుర్‌కు చెందిన ఇద్దరు యువకులు శ్రీరాముడి దర్శనం సైకిళ్లపై అయోధ్యకు బయలుదేరారు.
ఉదయ్‌పుర్‌కు చెందిన జితేంద్ర పటేల్, రిషబ్ జైన్ రామ్‌లల్లాను దర్శించుకునేందుకు శనివారం బయలుదేరారు. ఉదయం 5:15 గంటలకు ఫతే పాఠశాలలో ఉన్న బాలాజీ ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత, శ్రీరాముడిని స్తుతిస్తూ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వీరిని ఉదయ్‌పుర్ సైక్లింగ్ క్లబ్ సహా పలువురు స్థానికులు ప్రోత్సహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
రామయ్య దర్శనమే అతిపెద్ద అవార్డు!
ఈ సైకిల్ యాత్ర ఎలాంటి అవార్డు కోసం చేపట్టడం లేదని సైక్లిస్ట్ జితేంద్ర పటేల్ తెలిపారు. రామ్‌లల్లా దర్శనమే తమకు అతిపెద్ద అవార్డు అని తెలిపారు. తమలో ఉన్న భక్తిభావమే అయోధ్యకు సైకిల్‌పై వెళ్లేలా చేసిందని రిషబ్ జైన్ తెలిపారు. 500 ఏళ్ల నిరీక్షణ ముగిసిందని, భక్తుడిలా దర్శనం కోసమే అయోధ్యకు వెళుతున్నట్లు రిషబ్, జితేంద్ర చెప్పారు.