Yoga Child Expert In Uttarakhand :కష్టతరమైన యోగాసనాలను సులువుగా వేస్తూ అబ్బురపరుస్తోంది ఓ ఏడేళ్ల బాలిక. చిన్నతనం నుంచే యోగాపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. సంప్రదాయ యోగా పోటీల్లో నాలుగో స్థానాన్ని సంపాదించింది. యోగా మాత్రమే కాకుండా జిమ్నాస్టిక్స్లోనూ రాణిస్తోంది ఉత్తరాఖండ్‌కు చెందిన హర్షికా రిఖాడీ.
"నా పేరు హర్షికా రిఖాడీ. నాకు ఏడు సంవత్సరాలు. మూడో తరగతి చదువుతున్నాను. నేను యాక్షన్ వరల్డ్ జిమ్నాస్టిక్స్ సెంటర్ నీరజ్ ధపోలా ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాను. నేను మొదటగా జిల్లా స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచాను. రాష్ట్ర స్థాయిలో ఒక గోల్డ్, ఒక కాంస్య పతకం, నేషనల్ లెవెల్లో ఒక కాంస్య పతకం సాధించాను"
--హర్షికా రిఖాడీ
చిన్నతనంలోనే యోగా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హల్ద్వానీకి చెందిన హర్షిక. యోగాతో పాటు జిమ్నాస్టిక్స్లోనూ శిక్షణ తీసుకుంటుంది. కాగా, హర్షికకు చిన్నప్పటి నుంచే యోగాపై ఆసక్తి ఉందని, గత రెండేళ్లుగా ఇందులో శిక్షణ పొందుతోందని బాలిక తండ్రి భువన్ రిఖాడీ తెలిపారు. హర్షికకు డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని ఆమె తల్లి మోనికా రిఖాడీ తెలిపారు. యోగాతో పాటు డ్యాన్స్ పోటీల్లోనూ హర్షిక పాల్గోంటోందని ఆమె చెప్పారు.
"హర్షికకు చిన్నప్పటి నుంచి యోగాపై ఆసక్తి ఉంది. ఆమె శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందుకే ఆమెకు యోగాలో శిక్షణ ఇప్పించాము. యోగా వల్ల శరీరం, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది."