Tips to Clean Dust Between Tiles: ప్రస్తుతం ఎవరి ఇంట్లో చూసినా ఎక్కువ శాతం టైల్స్ కనిపిస్తున్నాయి. హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఇలా రూమ్‌కు తగ్గట్టుగా టైల్స్ వేయించుకుంటున్నారు. టైల్స్ ఇంటికి ఎలిగెంట్ లుక్ తీసుకొస్తాయి మరి. అందుకే.. అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే.. టైల్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నా సరే వాటి మధ్య మురికి చేరుతుంటుంది. కొన్ని రోజుల్లో అది కాస్తా గట్టిపడిపోతుంది. ఫలితంగా ఎంత ప్రయత్నించినా మురికి వదలదు. ఇలా చూస్తుండగానే పాత వాటిలా మారిపోతాయి.
అయితే.. టైల్స్ మధ్య చేరిన మురికిని కొన్ని చిట్కాల ద్వారా పోగొట్టవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ టిప్స్ ద్వారా మురికి పోవడంతోపాటు కొత్తవాటిలా మెరిసిపోతూ ఉంటాయని చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..
వెనిగర్:టైల్స్ మధ్య మురికిని క్లీన్ చేయడంలో వెనిగర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం వెనిగర్, గోరువెచ్చని నీటిని సమపాళ్లలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసి టైల్స్ మధ్య మురికి పేరుకున్న చోట స్ప్రే చేయాలి. ఐదు నిమిషాల తర్వాత స్క్రబ్ లేదా బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోయి ఫ్లోర్ శుభ్రంగా తయారవుతుంది.
ఫర్నిచర్‌పై మరకలు పోవాలా? ఈ టిప్స్ పాటిస్తూ క్లీన్ చేస్తే సూపర్ షైన్ గ్యారెంటీ! - Tips to Clean Furniture
నిమ్మరసం:ఇది కూడా మురికిని వదిలించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం నిమ్మరసాన్ని నీటిలో కలిపి మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మ వల్ల టైల్స్ నునుపుదనం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి.. కాస్త ఎక్కువ నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.
బేకింగ్ సోడా:బేకింగ్ సోడా కూడా టైల్స్ మధ్య మురికిని పోగొట్టడానికి సహాయపడుతుంది. ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్‌ను మురికి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15 నిమిషాలు వదిలేయాలి. తర్వాత స్క్రబ్బర్ సాయంతో క్లీన్ చేస్తే మురికి వదులుతుంది.
హైడ్రోజన్ పెరాక్సైడ్:దెబ్బలు తగిలినప్పుడు ఆ భాగాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ని సైతం టైల్స్ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని నేరుగా ఫ్లోర్‌ని శుభ్రం చేయడానికి వాడుకోవచ్చంటున్నారు. లేదంటే దీనిలో బేకింగ్ సోడాను కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేసి టైల్స్ మధ్య రాసి ఆ తర్వాత నీటితో కడిగినా మంచి ఫలితం కనిపిస్తుంది.
మీ బంగారు ఆభరణాలు ఇలా క్లీన్ చేయండి - కొత్త వాటిలా ధగధగా మెరిసిపోతాయ్!
ఈ వస్తువులను బాత్రూమ్లో ఉంచుతున్నారా? - మీ గుండెకు ముప్పు తప్పదు!