తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమికుల రోజు స్పెషల్​- మీ ప్రియమైన వారి కోసం రెడ్​ వెల్వెట్​ కేక్​! చేయడం చాలా ఈజీ! - cakes for valentines day in telugu

Eggless Red Velvet Cake Making Process: వాలెంటైన్స్​ డే నాడు మీకు ఇష్టమైన వారితో కలిసి కేక్​ కట్​ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఇది. ప్రతిసారీ బేకరీలో కొనే కేక్​ కాకుండా ఈసారి మీరే స్వయంగా రెడీ చేయండి. మీ పార్ట్​నర్​ సర్​ప్రైజ్​ ఫీల్​ అవ్వడమే కాకుండా, ఇద్దరికీ లైఫ్​లాంగ్​ మెమరీగా ఉంటుంది.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 5:10 PM IST

Updated : Feb 14, 2024, 9:07 AM IST

Eggless Red Velvet Cake Making Process: వాలెంటైన్స్ డే వచ్చేసింది. ఈ క్రమంలో ప్రేమికుల చూపులన్నీ చాక్లెట్లు, కేకుల మీదే ఉంటాయి. ప్రేమికుల రోజున తమ ప్రియమైన వారికి చాక్లెట్లను గిఫ్ట్స్​గా ఇవ్వడం, తమ ప్రేమను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇరువురు కలిసి కేక్​ కట్ చేయడం కామన్​. ఇక కేక్​ కొనాలంటే బేకరీకి వెళ్లాల్సిందే. అయితే ఈ సారి కేక్​ బయట కొనకుండా ఇంట్లో మీరే స్వయంగా ​ రెడీ చేయండి. ఈ కేక్ తయారు చేయడం కూడా చాలా సులువు. ఇది మీకు ఈ ఏడాదంతా మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారంటీ. మరి ఎగ్​లెస్​ రెడ్​ వెల్వెట్​ కేక్ ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

ఎగ్​లెస్​ రెడ్​ వెల్వెట్​ హార్ట్​ కేక్​కు కావాల్సిన పదార్థాలు:

  • మైదా పిండి - 350 గ్రాములు
  • బేకింగ్​ పౌడర్​ - 15 గ్రాములు
  • ఉప్పు - చిటికెడు
  • పంచదార పొడి - 250 గ్రాములు
  • వెనీలా ఎసెన్స్​ - 10ml
  • పెరుగు - 360 గ్రాములు
  • బేకింగ్​ సోడా - 5 గ్రాములు
  • కోకో పౌడర్​ - 20 గ్రాములు
  • అన్​సాల్టెడ్​ బటర్​ - 230 గ్రాములు
  • సోర్​ క్రీమ్​ - 120 ml
  • వెనిగర్​ - 5ml
  • ఫుడ్​ కలర్​ - చిటికెడు

ఫ్రాస్టింగ్​ కోసం

  • మాస్కార్పోన్ చీజ్ - 450 గ్రాములు
  • ఉప్పు - చిటికెడు
  • వెనీలా ఎసెన్స్​ - 5 ml
  • ఐసింగ్​ షుగర్​ - 480 గ్రాములు
  • అన్​సాల్టెడ్​ బటర్​ - 225 గ్రాములు
  • షుగర్​ సిరప్​ కోసం- ఒకటిన్నర స్పూన్ల పంచదార, పావుకప్పు నీళ్లు, ఒక టీస్పూన్​ రోజ్​ వాటర్​

తయారీ విధానం:

  • ముందుగా ఓవెన్​ను 180 డిగ్రీల సెల్సియస్​ వద్ద 10 నిమిషాల పాటు ప్రీ హీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు హార్ట్​ షేప్​లో ఉన్న కేక్​ మౌల్డ్ తీసుకుని గిన్నె మొత్తానికి బటర్​ అప్లై చేసి మైదా పిండి చల్లుకోవాలి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని మైదాపిండి, బేకింగ్​ పౌడర్​, బేకింగ్​ సోడా, కోకో పౌడర్​, ఉప్పు వేసి జల్లించుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు మరో గిన్నెలో అన్​సాల్టెడ్​ బటర్​, పంచదార పొడి వేసి ఎలక్ట్రిక్​ విస్కర్​​తో స్మూత్​గా అయ్యేవరకు కలుపుకోవాలి. ఇది స్మూత్​గా కావడానికి సుమారు 4 నిమిషాలు పడుతుంది. తర్వాత అందులో సోర్​ క్రీమ్​, వెనీలా ఎసెన్స్​, వెనిగర్​ వేసి కలుపుకోవాలి.
  • తర్వాత అందులోకి ముందుగా జల్లించి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని వేసుకుని ఎలక్ట్రిక్​ విస్కర్​తో కలుపుకోవాలి. తర్వాత పెరుగు, ఫుడ్​ కలర్​ వేసుకుని బాగా బీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు ముందే మైదాపిండితో డస్టింగ్​ చేసుకున్న కేక్​ మౌల్డ్​ తీసుకుని అందులోకి ఈ మిశ్రమాన్ని పోసి.. బబుల్స్​ లేకుండా రెండు సార్లు ట్యాప్​ చేయాలి.
  • తర్వాత ఈ మౌల్డ్​ను ప్రీ హీట్​ చేసిన ఓవెన్​లో పెట్టి 25 నుంచి 30 నిమిషాల మధ్యలో కేక్​ను బేక్​ చేసుకోవాలి.
  • తర్వాత కేక్​ను పూర్తిగా చల్లారేవరకు పక్కకు పెట్టాలి.
  • ఇప్పుడు ఫ్రాస్టింగా కోసం.. ఓ గిన్నెలో ఐసింగ్​ షుగర్​, అన్​సాల్టెడ్​ బటర్​ వేసుకుని ఎలక్ట్రిక్​ విస్కర్​తో చిక్కటి క్రీమ్​ అయ్యేలాగా కలుపుకోవాలి. అయితే ఐసింగ్​ షుగర్​ ఒక్కసారిగా కాకుండా కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి.
  • తర్వాత వెనీలా ఎసెన్స్​, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చీజ్​ వేసి బాగా బీట్​ చేసుకోవాలి. ఈ క్రీమ్​ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు ఎలక్ట్రిక్​ విస్కర్​తో బీట్​ చేసుకోవాలి. అంతే ఫ్రాస్టింగ్​ కోసం క్రీమ్​ రెడీ అయిపోయింది.
  • ఇప్పుడు మరో చిన్నె గిన్నెలో ఒకటిన్నర స్పూన్​ పంచదార, పావుకప్పు నీరు, 1 టీస్పూన్​ రోజ్​ వాటర్​ తీసుకుని పంచదార కరిగే వరకు కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు కేక్​ను మౌల్డ్​ నుంచి సెపరేట్​ చేసిన తర్వాత దానిని 3 లేయర్స్​గా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కేక్​ స్టాండ్​ లేదా ఓ ప్లేట్​ తీసుకుని దానిపై కేక్​ లేయర్​ను పెట్టి కొద్దిగా షుగర్​ సిరప్​ అప్లై చేసుకోవాలి. తర్వాత ఫ్రాస్టింగ్​ క్రీమ్​ పూసి సమాంతరంగా అప్లై చేసుకోవాలి.
  • ఇప్పుడు మిగిలిన రెండు లేయర్లను కూడా అలానే చేసుకోని.. మిగిలిన ఫ్రాస్టింగ్​ క్రీమ్​ మొత్తాన్ని కేక్​ చుట్టూ నీట్​గా అప్లై చేసుకోవాలి.
  • తర్వాత చెర్రీస్​, ఇంకా ఇతర పదార్థాలను ఉపయోగించి మీకు నచ్చిన విధంగా కేక్​ను డెకరేట్​ చేసుకోవచ్చు.
  • అంతే ఎంతో టేస్టీ అయినా వాలెంటైన్స్​ డే స్పెషల్​ ఎగ్​లెస్​ రెడ్​ వెల్వెట్​ హార్ట్​ కేక్​ రెడీ..

వాలెంటైన్స్​ డే స్పెషల్​ - మీ ప్రియమైన వారికి ఇలా విషెస్​ చెప్తే ఫిదా అయిపోతారంతే!

నా ప్రేమ నిత్యనూతనం!: ఎన్నో రాత్రులు.. ఎన్నో కాగితాలు..! ఇదే నా మొదటి ప్రేమలేఖ!

ప్రేమికుల రోజున మీ లవర్​కు ఈ గిఫ్ట్‌ ఇవ్వండి - ఖర్చు తక్కువ ఎఫెక్ట్ ఎక్కువ!

Last Updated : Feb 14, 2024, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details