తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పండగ పూట విషాదం- లోయలో వాహనం పడి 8మంది మృతి - Uttarakhand Road Accident - UTTARAKHAND ROAD ACCIDENT

Uttarakhand Road Accident : ప్రమాదవశాత్తు వాహనం లోయలో పడి ఏడుగురు నేపాలీలు సహా ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్​లో జరిగిందీ ఘటన.

Uttarakhand Road Accident
Uttarakhand Road Accident

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 11:13 AM IST

Updated : Apr 9, 2024, 11:54 AM IST

Uttarakhand Road Accident :ఉత్తరాఖండ్‌ నైనితాల్ జిల్లాలో వాహనం లోయలో పడిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు నేపాల్‌కు చెందినవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు(నెపాలీలు) తీవ్రంగా గాయపడ్డారు. కాగా, వాహనంలో మొత్తం 10మంది ఉన్నట్లు సమాచారం.

మంగళవారం ఉదయం బేతాల్‌ఘాట్‌ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్‌ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం-ఎస్​డీఆర్ఎఫ్​ ఘటనాస్థలికి చేరుకుంది. స్థానికులు, పోలీసుల సహకారంతో ఎస్​డీఆర్ఎఫ్​ బృందం ఎనిమిది మృతదేహాలను వెలికితీసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

లోయలో పడిన వాహనంలో మహేంద్రనగర్‌కు చెందిన తొమ్మిది మంది నేపాలీ పౌరులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో స్థానికుడైన డ్రైవర్ రాజేంద్ర కుమార్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఫంక్షన్​కు వెళ్లి తిరిగిరాని లోకాలకు!
Tamilnadu Tiruppur Road Accident :తమిళనాడులోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమ 60వ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ దంపతులను మృత్యువు కబళించింది.

ఐదుగురు మృతి
తిరుపూర్​కు చెందిన చంద్రశేఖర్​, చిత్ర దంపతులు. సోమవారం వీరి 60వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుక్కడైయూర్​లో విందు ఏర్పాటు చేశారు. దీనిని ముగించుకొని మంగళవారం తెల్లవారుజామున తిరిగి కారులో వెల్లకోవిల్‌ మీదుగా తిరుపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఓలపాళయం వద్ద తిరుచ్చి వైపు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న చంద్రశేఖర్​తో పాటు లోపల ఉన్న చిత్ర, ప్రిన్స్​, అరివిత్ర సహా మూడు నెలల చిన్నారి సాక్షి అక్కడికక్కడే మృతి చెందారు.

ఇక ఈ ఘోర ప్రమాదంతో కోయంబత్తూరు-తిరుచ్చి జాతీయ రహదారిపై రెండు గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెల్లకోవిల్‌ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారు, బస్సును రోడ్డుపై నుంచి తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొత్త పరుపు కొనుగోలు చేస్తున్నారా? - ఈ విషయాలు మరిచిపోవద్దు! - Tips To Choose Good Mattress

స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదిరిపోతుంది! - How to Make Orange Barfi

Last Updated : Apr 9, 2024, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details