తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్ ట్రైన్​- ముగ్గురు మృతి, 33 మందికి గాయాలు - Train Accident Today - TRAIN ACCIDENT TODAY

UP Train Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. చంఢీగఢ్​ నుంచి అసోంకు డిబ్రూగఢ్ ఎక్స్​ప్రెస్ రైలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

UP Train Accident
UP Train Accident (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 3:54 PM IST

Updated : Jul 18, 2024, 7:12 PM IST

UP Train Accident Today :ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో చండీగఢ్‌- డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు మరణించారు. 33 మంది గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన రైలు ఉదయం 11.30 గంటలకు చండీగఢ్‌ స్టేషన్‌ నుంచి అసోంలోని డిబ్రూగఢ్‌కు బయల్దేరింది. గురువారం మధ్యాహ్నం యూపీలోని ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో రైలులోని నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే రైలు పట్టాలు తప్పిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వారంతా కేకలు వేయడం ప్రారంభించారు. రైలు ఆగిన వెంటనే దిగి పరుగులు తీశారు.

హెల్ప్​లైన్ నంబర్స్ ఏర్పాటు
డిబ్రూగఢ్ ఎక్స్​ప్రెస్ ప్రమాద ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు ప్రారంభించింది. హెల్ప్​లైన్ నంబర్స్​ను కూడా ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఎక్స్​లో పోస్ట్ చేసింది. కొన్ని రైళ్లను దారి మళ్లిస్తామని తెలిపింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించింది. తీవ్రందగా గాయపడ్డ వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.50000 అనౌన్స్ చేసింది. CRS విచారణతో పాటు, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

సీఎంల స్పందన
మరోవైపు, గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు, సంబంధిత వర్గాలతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు సీఎంఓ వెల్లడించింది. మృతుల్లో తమ రాష్ట్రానికి చెందిన వారెవరు లేరని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.

బంగాల్ రైలు ప్రమాదం కేసులో కీలక మలుపు! సజీవంగా చనిపోయాడనుకున్న అసిస్టెంట్ లోకోపైలట్​! - West Bengal Train Accident

'కవచ్' ఉంటే బంగాల్​ రైలు ప్రమాదం తప్పేదా? అసలేంటీ వ్యవస్థ? - Kavach System In Railway

Last Updated : Jul 18, 2024, 7:12 PM IST

ABOUT THE AUTHOR

...view details