తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళలకు ఏటా రూ.18000! రెండు ఫ్రీ గ్యాస్​ సిలిండర్లు- జమ్ముకశ్మీర్​లో బీజేపీ ఉచితాల వర్షం - amit shah jk manifesto - AMIT SHAH JK MANIFESTO

Amit Shah JK Manifesto : జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ తమ మేనిఫెస్టోలో ఉచిత హామీల వర్షం కురిపించింది. ప్రతి ఇంట్లో వృద్ధ మహిళకు ఏడాదికి రూ.18000 ఇస్తామని తెలిపింది. ఇంటింటికి రెండు గ్యాస్​ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చింది.

Amit Shah JK Manifesto
Amit Shah JK Manifesto (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 5:10 PM IST

Updated : Sep 6, 2024, 7:02 PM IST

Amit Shah JK Manifesto : జమ్ముకశ్మీర్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉచిత పథకాలతో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మేనిఫెస్టోను 'సంకల్ప్​ పత్ర్​' పేరుతో విడుదల చేశారు కేంద్ర మంత్రి అమిత్​ షా. 'మా సమ్మాన్​ యోజన' కింద ప్రతి కుటంబంలోని వృద్ధ మహిళకు ఏడాదికి రూ.18,000 ఇస్తామని ప్రకటించారు. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా రెండు గ్యాస్​ సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఇక ప్రగతి శిక్ష యోజన కింద కాలేజీ విద్యార్థులకు ఏడాదికి రూ.3000 చొప్పున ఇస్తామని అమిత్​ షా ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్​ షా​ మాట్లాడారు. గత పదేళ్లలో జమ్ముకశ్మీర్​ స్వర్ణ యుగాన్ని చూసిందన్నారు. శాంతి, అభివృద్ధి, పురోగతి అభివృద్ధికి హామీ ఇచ్చిందని తెలిపారు. అనంతరం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

"నేను ఎన్​సీ(నేషనల్​ కాన్ఫరెన్స్​) పార్టీ ఎజెండా ఏంటో చూశాను. ఎన్​సీకి కాంగ్రెస్ మౌనంగా మద్దతు ఇస్తుండటం కూడా చూశాను. కానీ నేను దేశ ప్రజలకు ఒకటే చెప్పదలచుకున్నా. ఇకపై అధికరణ 370 ఒక చరిత్ర, అది ఎన్నటికీ తిరిగి రాదు. ఈ ఆర్టికల్ యువత చేతుల్లో ఆయుధాలు, రాళ్లను మాత్రమే ఇచ్చింది. యువత ఉగ్రవాదం వైపు నడిచేలా చేసింది. నేను ఒమర్​ అబ్దుల్లాకు ఒకటే చెప్పదలచుకున్నా, ఎన్నికల ఫలితాలు ఏమైనా కానీ, గుజ్జర్లకు ఇచ్చిన రిజర్వేషన్ల జోలికి ఎవ్వరినీ వెళ్లనివ్వం. గత పదేళ్లలో జమ్ముకశ్మీర్​ స్వర్ణ యుగాన్ని చూసింది. శాంతి, అభివృద్ధి, పురోగతి అభివృద్ధికి హామీ ఇచ్చింది. జమ్ముకశ్మీర్​లో తీవ్రవాదం ఆవిర్భావానికి బాధ్యులెవరో నిర్ధరించడానికి శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి భరోసా ఇచ్చేందుకు మాకు ఐదేళ్ల పదవీ కాలం ఇవ్వాలని జమ్ముకశ్మీర్​ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా" అని అమిత్​ షా అన్నారు.

మేనిఫెస్టోలోని మరిన్ని ముఖ్యమైన హామీలు

  • పండిట్‌ ప్రేమ్‌నాథ్‌ డోగ్రా రోజ్‌గార్‌ యోజన కింద 5 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం.
  • ప్రగతి శిక్షా యోజన కింద కళాశాలకు వెళ్లే విద్యార్థులకు 3వేల రూపాయల ట్రావెల్ అలవెన్స్‌ను అందించడం.
  • వైద్య కళాశాల్లో వెయ్యి అదనపు సీట్లను మంజూరు చేయడం. UPSC, JKPSC పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కోచింగ్ ఫీజు కింద రెండేళ్ల పాటు 10 వేల రూపాయలతో పాటు ఒక్కసారి పరీక్ష ఫీజును చెల్లించడం.
  • మారుమూల ప్రాంతాలలో ఇంటర్‌ చదివే విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌.
  • వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్‌ను ప్రస్తుతం ఉన్న వాటి కంటే మూడింతలు చేసి ఇవ్వడం.
  • పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు జమ్ములో ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయడం.

వీటితో పాటు జమ్ముకశ్మీర్‌ను టెరరిస్టు హాట్‌స్పాట్‌ నుంచి టూరిస్ట్‌ స్పాట్‌గా మారుస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. హిందూ ఆలయాలను పునర్నిర్మించడం సహా పునరుద్ధరిస్తామని తెలిపింది. భూమి లేనివారికి అటల్ ఆవాస్ యోజన కింద 1361 చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

కాంగ్రెస్​లోకి వినేశ్, భజరంగ్- హరియాణా ఎన్నికల్లో పోటీపై వారిదే నిర్ణయం! - Vinesh Phogat Bajrang Punia

'కోల్​కతా డాక్టర్​పై గ్యాంగ్ రేప్ జరగలేదు- నిందితుడు ఒక్కడే!' - Kolkata Doctor Case

Last Updated : Sep 6, 2024, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details