- యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
- బడ్జెట్‌లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేశాం: ప్రధాని మోదీ
- మధ్యతరగతికి భరోసా ఇచ్చే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
- దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్: ప్రధాని మోదీ
- మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాం: ప్రధాని మోదీ
- చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్తబాటలు వేశాం: మోదీ
- మౌలిక, తయారీ రంగాలను బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంది: ప్రధాని
- దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది: ప్రధాని మోదీ
- ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాం: ప్రధాని
- ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన: ప్రధాని
- కొత్త ఉద్యోగులకు తొలి జీతం మా ప్రభుత్వమే అందిస్తుంది: ప్రధాని
- కోటిమందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నాం: ప్రధాని మోదీ
- ఇంటర్న్‌షిప్ ద్వారా గ్రామీణులకూ పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం: ప్రధాని
- గ్రామం నుంచి మహానగరం వరకు అందర్నీ వ్యాపారవేత్తలు చేయడం లక్ష్యం: ప్రధాని
- ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం: ప్రధాని
- భారత్‌ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుస్తున్నాం: ప్రధాని
- ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం: ప్రధాని మోదీ
- అంతరిక్ష వ్యాపారానికి రూ.వెయ్యి కోట్లతో నిధి: ప్రధాని మోదీ
అన్ని వర్గాలకు శక్తినిచ్చేలా కేంద్ర బడ్జెట్: ప్రధాని మోదీ - Union Budget 2024
Published : Jul 23, 2024, 8:44 AM IST
|Updated : Jul 23, 2024, 2:17 PM IST
Union Budget 2024 Live Updates :అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించారు. వరసగా 7సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మల సాధించారు.
LIVE FEED
నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024 సమర్పించిన తర్వాత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారిపోయాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 471 పాయింట్లు నష్టపోయి 80,044 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 151 పాయింట్లు కోల్పోయి 24,357 వద్ద కొనసాగుతోంది.
బడ్జెట్ స్వరూపం
కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
పన్ను శ్లాబులు
ఆదాయపన్ను పాత విధానంలో ఎలాంటి మార్పుల్లేవు
కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్, పన్ను శ్లాబుల్లో మార్పు
కొత్త విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త విధానంలో రూ.3 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు
కొత్త విధానంలో రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను
కొత్త విధానంలో రూ.15 లక్షలు, ఆపైన ఆదాయానికి 30 శాతం పన్ను
ఆదాయపన్ను చెల్లింపుదారులు కొత్త విధానంలోకి మారే దిశగా చర్యలు
తొమ్మిది ప్రాధాన్యాలు
తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 1. వ్యవసాయ ఉత్పాదకత
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 2. ఉద్యోగకల్పన-నైపుణ్యాభివృద్ధి
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 3. సమ్మిళిత వృద్ధి-సామాజిక న్యాయం
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 4. తయారీ, సేవల రంగం
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 5. పట్టణాభివృద్ధి
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 6. ఇంధన భద్రత
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 7. మౌలిక సదుపాయాల కల్పన
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 8. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి
తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 9. భవిష్యత్ సంస్కరణలు
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారికి వర్తింపు
రూ.3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
అంకురాలు, ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం
అన్ని తరగతుల పెట్టుబడిదారులపై ఏంజెల్ ట్యాక్స్ రద్దు
వృత్తి నిపుణులు విదేశాల్లో కలిగివున్న చరాస్తులపై సమాచారం ఇచ్చి తీరాలి.. లేకుంటే కఠిన చర్యలు
గతేడాది రికార్డు స్థాయిలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు
కస్టమ్స్ సుంకాల్లో మార్పులు
ఆదాయపన్ను చెల్లింపుదార్లులో మూడింటా రెండొంతుల మంది కొత్త విధానంలోకి వచ్చారు
కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు
సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
క్యాన్సర్ రోగులకు ఊరట
- క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
- మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
- బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
- ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదింపు
- కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
- మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
- పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
- అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
- నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు
- సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం
- ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
- ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
- వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
- భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- యూఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
- ప్రతి భూకమతానికి యూఎల్ పిన్ నెంబర్ కేటాయింపు
- ప్రతి భూకమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు
- ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
- దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానంలో సరళీకరణ
వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు
భవిష్యత్ తరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
యూఎల్ పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు
ప్రతి భూకమతానికి యూఎల్ పిన్ నెంబర్ కేటాయింపు
ప్రతి భూకమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు
ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు రుణాలు
- అసోంలో వరద నివారణ, నియంత్రణకు కొత్త ప్రాజెక్టులకు కేంద్ర సాయం
- హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలో ప్రకృతి బీభత్సాలకు సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు
- టూరిజం అభివృద్ధి కింద గయాలోని విష్ణుపాద, బుద్ధగయలోని మహబోధి ఆలయాలకు ప్రపంచస్థాయి అభివృద్ధి
- కాశీ విశ్వనాథ కారిడార్‌కు ప్రపంచ స్థాయి అభివృద్ధి
- రాజగృహ ప్రత్యేక అభివృద్ధికి నిధులు
- సప్తర్షి ఉష్ణకుండలాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు
- ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశోధనలకు నిధులు అందుబాటు
- అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి వెంచర్ క్యాపిటల్ కింద రూ.వెయ్యి కోట్లు
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
మినరల్ మిషన్ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక
ఆఫ్‌షోర్ మైనింగ్‌కు నూతన విధానం
సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం
ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు
ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు
500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పన
వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు
పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు
ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం
పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరం
భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైంది
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం
హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు
విశాఖ-చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ
రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
రూ.26 వేల కోట్లుతో బిహార్‌లో నూతన హైవేలు, వంతెనల నిర్మాణం
- వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల అభివృద్ధి
- నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తాం
- భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ
- స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు
- ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి రెండో ప్రాధాన్యత
- సంఘటిత రంగంలో ఈపీఎఫ్‌వోలో నమోదైన కార్మికులకు నెల జీతం ప్రభుత్వం చెల్లిస్తుంది
- నెల జీతాన్ని మూడు వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది
- తయారీరంగంలో కొత్త ఉద్యోగులకు నెల జీతం అందుతుంది
- అదనపు ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనపు ప్రోత్సాహం
- రూ.లక్షలోపు జీతం ఉన్న ఉద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఈపీఎఫ్‌వోలో ఉద్యోగి పేరున జమ
- కూరగాయల సప్లయ్ చైన్ నిర్వహణకు కొత్త స్టార్టప్‌లకు అవకాశం
- సేకరణ, నిల్వ, సరఫరాకు తగిన పెట్టుబడులు అందుబాటులోకి తెస్తాం
- కూరగాయలు ఉత్పత్తి చేసే 6 కోట్లమంది రైతుల డేటా సేకరణ
- సహకార రంగాన్ని సుస్థిరపరిచేందుకు నిర్మాణాత్మక విధానాల రూపకల్పన
9 ప్రధానాంశాల ఆధారంగా ఈ బడ్జెట్ తయారైంది
వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం ప్రధానం
వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 నూతన వంగడాలు
పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే ప్రయత్నం
వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వుల ఉత్పాదకత పెంచేలా చర్యలు
- ఆహార, ఇంధనేతర ద్రవ్యోల్బణం 3.1 శాతానికి పరిమితమైంది
- దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధరలకు గణనీయంగా పెంచాం
- కనీసం 50 శాతం మిగులు ఉండేలా మద్దతు ధరలు సవరించాం
- విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం లక్షా 48 వేల కోట్లు ఖర్చు చేస్తాం
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
- ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ
మరికాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో జారుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు ప్రస్తుతం అప్రమత్తంగా కదలాడుతున్నాయి. ఉదయం 10:48 గంటల సమయంలో సెన్సెక్స్ 86 పాయింట్ల నష్టంతో 80,415 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు కుంగి 24,463 వద్ద కొనసాగుతోంది.
- 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
- కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
డొల్ల వాగ్దానాలు తప్ప ఏమీ ఉండదు: గౌరవ్ గొగొయ్
"ప్రధాని తనకు సన్నిహితంగా ఉండే కోటీశ్వరులకు బడ్జెట్ ద్వారా సహాయం చేస్తారు. మధ్యతరగతి, నిజాయతీ గల పన్ను చెల్లింపుదారులకు డొల్ల వాగ్దానాలు తప్ప మరేమీ లభించదు" - గౌరవ్ గొగొయ్, కాంగ్రెస్ ఎంపీ
దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే దిశగా బడ్జెట్: సింధియా
"దేశాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు సంకల్పంగా బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ ఆధారంగా ప్రధాన మంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా వికసిత్ భారత్ లక్ష్యం దిశగా శరవేగంగా సాగుతామని ఆశిస్తున్నాం". - కేంద్ర మంత్రి, జ్యోతిరాధిత్య సింధియా
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించే ముందు కేంద్ర బడ్జెట్‌ను ఆమోదించడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పార్లమెంట్‌లో సమావేశమైంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిజిటల్ బడ్జెట్ ట్యాబ్లెట్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించి అనుమతి తీసుకున్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిజిటల్ బడ్జెట్ ట్యాబ్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. అనంతరం బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించి అనుమతి తీసుకున్నారు. ఉదయం పదిన్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమై 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం లోక్‌సభలో 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
- రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- కేంద్ర బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతికి అందించనున్న నిర్మలా సీతారామన్
- రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకోనున్న నిర్మలా సీతారామన్
బడ్జెట్‌కు ముందు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
- లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
- డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.64 వద్ద ప్రారంభం
- సెన్సెక్స్ 80,745 వద్ద, నిఫ్టీ 24,559 దగ్గర ట్రేడింగ్ ప్రారంభం
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి బయలుదేరారు. మరికొన్ని గంటల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.