తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'DGP బ్రదర్స్'​- రెండు రాష్ట్రాలకు అన్నదమ్ముళ్లే పోలీస్​ బాస్​లు!- చరిత్రలోనే తొలిసారి - two states two brothers both dgps

Two Brothers Different States DGPS : ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. ఒకరూ ఏడాది నుంచే డీజీపీగా విధులు నిర్వర్తిస్తుండగా మరొకరు సోమవారమే వేరే రాష్ట్రానికి బాధత్యలు చేపట్టారు. దీంతో పోలీస్ చరిత్రలోనే అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఒకే సారి డీజీపీగా ఉండటం ఇదే తొలిసారి. అయితే, డీజీపీగా నియామకమైన 24 గంటల్లోనే ఆ పదవి నుంచి ఒకరు తప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే?

2  brothers became DGPs of 2 different states
2 brothers became DGPs of 2 different states

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 10:40 AM IST

Updated : Mar 19, 2024, 4:53 PM IST

Two Brothers Different States DGPS : ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు ఐపీఎస్​లు అవ్వడమే కాదు రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులయ్యారు. పోలీస్ శాఖ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇద్దరిలో ఒకరు ఏడాది కాలంగా డీజీపీ పని చేస్తున్నారు. మరొకరు సోమవారమే డీజీపీగా బాధత్యలు చేపట్టారు. వారే బిహార్​కు చెందిన వివేక్ సహాయ్, వికాస్ సహాయ్

24 గంటలే!
బిహార్​కు చెందిన సహాయ్​ కుటుంబంలో మొత్తం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. వివేక్ సహాయ్ 1988 బ్యాచ్​, వికాస్ సహాయ్ 1989 బ్యాచ్ ఐపీఎస్​ అధికారులు. విక్రమ్ సహాయ్ 1992 బ్యాచ్ ఐఆర్​ఎస్ అధికారి. గతేడాది కాలంగా గుజరాత్ రాష్ట్రానికి డీజీపీగా వికాస్ సహాయ్ ఉన్నారు. సోమవారం వివేక్​ బంగాల్​ డీజీపీ నియమితులయ్యారు. అయితే నియామకం జరిగిన 24 గంటల్లోనే బంగాల్​ డీజీపీగా వివేక్​ సహాయ్​ తప్పుకోవాల్సి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య బంగాల్​ డీజీపీగా సంజయ్​ ముఖర్జీని నియమిస్తూ ఎన్నికల సంఘం మంగళవారం నిర్ణయం తీసుకుంది.

సీఎం మమతా బెనర్జీ సెక్యూరిటీ ఇన్​ఛార్జ్​గా
వివేక్ సహాయ్ బంగాల్​ కేడర్​కు చెందిన 1988 బ్యాచ్​ ఐపీఎస్ అధికారి. గతంలో డీజీ, డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ హోమ్​ గార్డ్​గా పనిచేశారు. 2021లో బంగాల్ సీఎం మమతా బెనర్జీ సెక్యూరిటీకి ఇన్​ఛార్జ్​గా ఉన్నారు. వివేక్ సెక్యూరిటీ ఇన్​ఛార్జ్​గా విఫలమయ్యాడని ఆ సంవత్సరమే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మళ్లీ 2023లో డీజీగా బాధ్యతలు అప్పగించారు. కాగా వివేక్ ఈ ఏడాదిలో పదవి విరమణ చేయనున్నారు.

ఇక వికాస్ సహాయ్ విషయానికొస్తే 1989 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. 1999లో గుజరాత్ ఆనంద్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2001లో అహ్మదాబాద్​లో రూరల్‌లో ఎస్పీగా పనిచేశారు. 2002లో జరిగిన గోద్రా ఘటనలో కూడా గాయపడ్డాడు. 2002లో అహ్మదాబాద్‌లోనే జోన్ 2,3కి డీసీపీగా నియమితులయ్యారు. 2004లో ట్రాఫిక్ డీసీపీ, 2005లో అహ్మదాబాద్‌లో అదనపు ట్రాఫిక్ సీపీ. ఆ తర్వాత 2007లో సూరత్‌లో అదనపు సీపీగా నియమితులయ్యారు. 2008లో జాయింట్ సీపీ సూరత్‌గా, 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో ఐజీ (సీఐడీ)గా పనిచేశారు. 2023లో గుజరాత్​కు డీజీపీగా నిమమితులయ్యారు.

సర్కార్​ వారి సొమ్ము కోసం కక్కుర్తి- అన్నాచెల్లెళ్ల పెళ్లి- చివరకు దొరికారిలా!

'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'

Last Updated : Mar 19, 2024, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details