Train Journey Rules :బ్రిటిష్ ఇండియాలో 1853 సంవత్సరంలో ప్రారంభమైన రైల్వే నేటికి దేశంలో అతిపెద్ద రవాణా సాధనంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 68 వేల కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరించింది. దేశంలో ఒకరోజులో దాదాపు 2.3 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో రైళ్లను వినియోగించుకుంటున్న ప్రయాణికులు వాటిలో జర్నీ చేస్తున్నప్పుడు పాటించవలసిన విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకుందామా?
1.అప్పుడు మాత్రమే చైన్ లాగాలి
Train Chain Pulling Rules :మనం సాధారణంగా ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు చైన్లను చూస్తుంటాం. అయితే వాటిని మెడికల్ ఎమర్జెన్సీ, లేదా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్‌కు గురైనప్పుడు మాత్రమే లాగాలి. అంతే కాకుండా పిల్లలు, లేదా వృద్ధులు, దివ్యాంగులు ట్రైన్ ఎక్కకముందే రైలు కదిలిన సందర్భంలోనూ లాగవచ్చు. అంతే తప్ప మరే ఇతర సమయాలలో ఎట్టి పరిస్థితుల్లో చైన్ లాగకూడదు.
2. గమ్య స్థానం మార్పు
పండగలు, లేదా ఇతరత్రా రద్దీ సమయాల్లో మనం అనుకున్న ప్రదేశానికి టికెట్ దొరకదు. ఆ సమయంలో మనం అంతకంటే ముందు స్టేషన్‌కు టికెట్ తీసుకోవచ్చు. ప్రయాణ సమయంలో టీసీకి అదనపు రుసుం చెల్లించి మన గమ్య స్థానాన్ని పొడగించుకునే వీలు ఉంటుంది. అయితే మీరు మెుదట కూర్చున్న సీటు మారే అవకాశం ఉంటుంది.
3. రాత్రి పూటే మధ్య బెర్త్!
Train Middle Berth Rule :సాధారణంగా మనం రిజర్వేషన్లో ప్రయాణిస్తున్నప్పుడు మిడిల్ బెర్త్‌లను గమనిస్తాం దాని విషయంలో ఒక ప్రత్యేక నియమం ఉంది. మిడిల్ బెర్త్‌ను ఉదయం వేళల్లో ఉపయోగించరాదు. కేవలం రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకే ఈ బెర్త్‌ను వాడాలి. ఒకవేళ అంతకంటే ముందే దీనిని వాడాలంటే తప్పనిసరిగా లోయర్ బెర్త్ ప్యాసింజర్ అనుమతి తీసుకోవాలి.