Tips To Clean Ceiling Fan : ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కచ్చితంగా ఉంటుంది. రోజంతా ఎక్కువగా ఆన్‌లో ఉండే వస్తువులలో ఇదీ ఒకటి. అయితే, సీలింగ్ ఫ్యాన్ చాలా ఎత్తులో ఉండటం వల్ల దీనిని తరచూ శుభ్రం చేయడం కష్టమవుతుంది. దీనివల్ల ఫ్యాన్‌పై దుమ్ము దూళీ, పేరుకుపోతాయి. ఇలా దుమ్ముతో ఉన్న ఫ్యాన్ తిరగడం వల్ల ఇంట్లోనిగాలి కలుషితం అవుతుంది. ఈ గాలి పీల్చడం వల్ల మనకు అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఫ్యాన్‌పై ఉన్న డస్ట్‌ను ఈజీగా తొలగించవచ్చని అంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేద్దామా..
పిల్లో కవర్‌తో క్లీన్ చేయండి : ఇంట్లో ఉండే పాత పిల్లో(దిండు) కవర్‌లతో సీలింగ్ ఫ్యాన్‌ని సులభంగా క్లీన్ చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎలా అంటే.. ముందుగా నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి పిల్లో కవర్‌లను ఫ్యాన్ రెక్కలకు తొడగాలి. తర్వాత పిల్ల కవర్‌లను పట్టుకుని ఫ్యాన్ రెక్కలను రుద్దుతూ శుభ్రం చేయండి. ఈ టిప్ పాటించడం వల్ల రెక్కలపైన ఉన్న దుమ్ము, దూళీ ఫ్లోర్‌పై పడకుండా ఉంటుంది. దీంతో ఫ్యాన్ ఈజీగా క్లీన్ అవుతుంది.
సాక్సులతో : ఫ్యాన్ క్లీన్ చేయడంలో సాక్సులు కూడా ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు. అందుకోసంపాత సాక్స్‌లను నీటిలో తడిపి.. ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేసుకోవచ్చు. సాక్స్‌లు మెత్తగా ఉండి.. సాగుతాయి కాబట్టి ఫ్యాన్‌ను శుభ్రం చేయడం చాలా సులభమవుతుంది. కాబట్టి, మీ సీలింగ్ ఫ్యాన్‌ను తళతళా మెరిపించడానికి ఈ టిప్ పాటించమని సలహా ఇస్తున్నారు.
అలర్ట్ : మీ అందాన్ని పాడుచేసే మొటిమలకు - మీ దిండు కారణమని తెలుసా?
డస్టర్ :సీలింగ్ ఫ్యాన్ పైన ఉన్న డస్ట్‌ను తొలగించడానికి డస్టర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ముందుగా డస్టర్‌ను నీటిలో ముంచి నీళ్లను పిండండి. తర్వాత నిచ్చెన లేదా కుర్చీపై నిలబడి డస్టర్ సహాయంతో ఫ్యాన్‌ను శుభ్రం చేయండి.