Son Surrendered To Police Protect Father : తల్లి హత్య కేసులో తండ్రిని రక్షించేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఓ మైనర్ కొడుకు. అయితే పోలీసుల విచారణలో తండ్రి సైతం హత్యలో పాల్గొన్నట్లు తేలడం వల్ల అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఇది జరిగింది
ఫిబ్రవరి 2న కేఆర్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హత్య జరిగింది. తన తల్లిని హత్య చేశానంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. బ్రేక్‌ఫాస్ట్ విషయంలో గొడవ తలెత్తడం వల్ల ఐరన్ రాడ్‌తో కొట్టి ఈ హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అందులో ఆసక్తికర విషయాలు బహిర్గతమయ్యాయి. హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్‌పై రెండు రకాల వేలిముద్రలు కనిపించాయి. దీంతో అనుమానించిన పోలీసులు, ఐరన్ రాడ్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. దీనిని పరీక్షించిన అధికారులు, వాటిని తండ్రి, కొడుకు వేలిముద్రలుగా గుర్తించారు. దీంతో వెంటనే మృతురాలి భర్త చంద్రప్పను అరెస్ట్ చేశారు పోలీసులు.