Sexual Assault On Orphan Teenager : కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరవకముందే ఉత్తరాఖండ్‌లో ఓ టీనేజర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. దెహ్రాదూన్‌లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఐదుగురు వ్యక్తులు, ఓ అనాథ టీనేజర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 13న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం బాధితురాలిని రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చింది. అనంతరం పటేల్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇద్దరు అనుమానితులు అరెస్ట్!
పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో చెల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందానికి కనిపించింది. వెంటనే ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం నాలుగు రోజులపాటు కౌన్సిలింగ్ ఇచ్చింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
"బాధితురాలిని ఆగస్టు 11న (ఆదివారం) ఆమెను తన సోదరి, బావ ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ అమ్మాయి దిల్లీ మీదుగా మొరాదాబాద్ చేరుకుంది. ఆ తర్వాత యూపీ ఆర్టీసీ బస్సులో ఆగస్టు 13వ తేదీ రాత్రి రెండున్నర గంటలకు దెహ్రాదూన్ చేరుకుంది. అప్పుడు ఐఎస్బీటీ స్టేషన్లో ఉన్న బాధితురాలు అక్కడికి వచ్చిన ఎర్ర రంగు బస్సు యూపీ ఆర్టీసీకి చెందినది అనుకుని ఎక్కింది. బాధితురాలు ఒంటరిగా కనిపించడం వల్ల ఐదుగురు వ్యక్తులు ఆమెపై బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను బస్సు నుంచి దించేసి దుండగులు పరారయ్యారు." అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు.