తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వన దేవతల దర్శనానికి వేళాయే - 'మండమెలిగే'తో మహా జాతరకు సిద్ధమైన మేడారం - మేడారంలో మండమెలిగే పండుగ

Sammakka Sarakka Jatara 2024 : మేడారంలో మండ మెలిగే పండుగ ఘనంగా జరిగింది. మహా జాతరకు సరిగ్గా వారం ముందు ఆలయ పూజారులు ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మండమెలిగే పండుగతో జాతర ప్రారంభమైనట్లుగా ఆదివాసీలు భావిస్తారు. వేకువజామునే పూజారులు ఆలయాలను శుద్ధి చేసి ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాల నడుమ మేడారం పరిసరాల్లో పూజారులు, గ్రామస్థులు పసుపు కుంకాలతో పూజలు చేశారు.

Medaram Mandamelige Festival
Sammakka Sarakka Jatara 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 7:20 AM IST

మండమెలిగే పండుగతో మహాజాతరకు సిద్ధమైన మేడారం

Sammakka Sarakka Jatara 2024: జాతర సమీపిస్తుండటంతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సమ్మక్క - సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మండమెలిగే పండుగతో మహా జాతరకు మేడారం సిద్ధమైంది. వారం రోజుల ముందుగా జరిగే మండమెలిగే పండుగను ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామస్థులు దిష్టి తోరణాలను కట్టి గ్రామాన్నంతా అష్టదిగ్బంధనం చేశారు.

Medaram Mandamelige Festival: మేడారంమహా జాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వచ్చే బుధవారం జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు వన దేవతలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి గద్దెల వద్దకు పయనమవుతున్నారు. పసుపు, కుంకమలు, గాజులు, చీర సారెలు, బంగారాన్ని వన దేవతలకు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

మేడారం సమక్క, సారలమ్మ జాతరకు ఆర్టీసీ సిద్ధం

Medaram jathara 2024: ప్రధాన జాతరకు ముందు నిర్వహించే మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. పూర్వం ప్రస్తుతం ఉన్న గుళ్ల స్థానాల్లో గుడిసెలుండేవి. జాతర నిర్వహించే సమయానికి ఇవి పాతపడడంతో అక్కడి ఆదివాసీ పూజారులు అడవికి వెళ్లి మండలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుళ్లు నిర్మించేవారు. దీన్నే మండమెలిగే పండుగంటారు. ఈ పండుగను ఆదివాసీ సంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాల నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మ తల్లులకు పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం దిష్టి తోరణాలను కట్టి మేడారాన్ని అష్టదిగ్బంధనం చేశారు.

రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా గద్దెల వద్ద జాగరణ కూడా చేశారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు, కొండాయిలోని గోవిందరాజు ఆలయాల్లోనూ ఈ మండమెలిగే పండుగ ఉత్సవాలు జరిగాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మహా జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Medaram Maha Jatara 2024: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. జాతర తొలిరోజు కన్నపెల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరు నాగారం మండలం కొండాయ్ నుంచి గోవిందరాజుల ఆగమనం ఉంటుంది. రెండో రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం చేస్తారు. మూడో రోజు వనదేవతలంతా గద్దెలపై కొలువై భక్తకోటితో పూజలందుకుంటారు. నాలుగో రోజు తిరిగి తల్లుల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మేడారం జాతరలో ధరల మోత - లీటర్ వాటర్ బాటిల్ ఎంతో తెలిస్తే షాక్?

మేడారం ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్​ఆర్టీసీ బేస్ క్యాంప్స్ : ఎండీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details