తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదేంటి? పెళ్లి కొడుకే పంతులా! మనోడు సూపరహే!! - GROOM MANTRAS AT WEDDING

వివాహంలో మంత్రాలు చదివిన పెళ్లి కుమారుడు- చప్పట్లతో హోరెత్తించిన అతిథులు!

Groom Mantras At Wedding
Groom Mantras At Wedding (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 2:41 PM IST

Groom Mantras At Wedding :సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన వివాహాల్లో కచ్చితంగా పూజారి/ పంతులు ఉంటారు. ఆయన వేదమంత్రాలు చదువుతుండగా, వివాహ బంధంలోకి అడుగుపెడతారు నూతన వధూవరులు. ఏడడుగులు నడిచి తమ కొత్త జీవితాలను మొదలుపెడతారు. ఇది అనేక పెళ్లిళ్లలో మనం చూసే ఉంటాం.

కానీ ఇటీవల ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమారుడే పంతులయ్యారు! స్వయంగా మంత్రాలు చదువుకుంటూ వివాహ తంతును పూర్తి చేశారు. అది కూడా మరో పూజారి పర్యవేక్షణలో వేద మంత్రాలు చదివారు. వివాహానికి చెందిన అన్ని ఆచార వ్యవహారాలు తెలిసిన ఆయనపై అనేక మంది ప్రశంసలు కురిపించారు.

మంత్రాలు చదువుతూ హోమం చేస్తున్న పెళ్లి కుమారుడు (ETV Bharat)

సహరన్​పుర్​ జిల్లాలోని రాంపుర్ మణిహరన్​కు చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్​కు హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్‌పుర్ గ్రామ నివాసి అయిన అనిల్ కుమార్ కుమార్తెతో కొన్ని రోజుల క్రితం వివాహ సంబంధం నిశ్చయమైంది. ఇటీవల వివాహం జరిపించాలని నిర్ణయించుకోగా, వివేక్ కుమార్ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వెళ్లారు.

ఆ తర్వాత వేదికపై శుభ ముహుర్తంలో వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకున్నారు. ఆ తర్వాత హోమం చేసి, మూడు ప్రదక్షిణలు చేయాల్సి ఉంది. అదే సమయంలో వరుడు తన వివాహ ఆచారాలను తానే నిర్వహిస్తానని పూజారికి చెప్పారు. మతపరమైన ఆచారాల మంత్రాలను కూడా తానే స్వయంగా పఠిస్తానని తెలిపారు.

నూతన వధూవరులు (ETV Bharat)

అనంతరం వరుడు మంత్రాలు జపించడం ప్రారంభించగా, అందరూ చప్పట్లు కొట్టారు. వివాహ ఆచారాల మంత్రాలన్నింటినీ ఎలా పఠించాలో తెలుసని చెప్పారు వివేక్​. మతపరమైన ఆచారాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే వేదమంత్రాలను పఠించడం నేర్చుకున్నానని వెల్లడించారు. మొత్తానికి వివేక్ వివాహం ఇప్పుడు చుట్టుపక్కప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details