Robot boy Adarsh Pathak Story :బిహార్‌కు చెందిన 10 ఏళ్ల బాలుడుకి రోబోలా మెదడులో చిప్ అమర్చారు. అలా చేస్తేనే గానీ ఆ పిల్లాడు మాట్లాడలేడు. ఎదుటివారు చెప్పింది వినలేడు. తల లోపల, బయట పెట్టిన ఆ చిప్స్ ఛార్జింగ్ అయిపోగానే నోరు మూగబోతుంది. చెవులు కూడా వినిపించవు. అందుకే రూ.2 కోట్లు ఖర్చు చేసి మరి ఆ పిల్లాడి మెదడులో చిప్స్‌ను పెట్టించారు అతడి తల్లిదండ్రులు. అసలేందుకు ఆ బాలుడి మెదడులో చిప్స్‌ను పెట్టారు? నెలకు ఆ బాలుడికి ఎంత ఖర్చవుతుందో తెలుసుకుందాం.
బెగుసరాయ్‌కు ఆదర్శ్ పాఠక్(10) పుట్టుకతోనే బర్త్ అఫాసియా అనే వ్యాధి ఉంది. అంటే పుట్టిన తర్వాత శిశువు ఒక నిమిషం లోపు ఏడవకపోవడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక బర్త్ ఆఫాసియా వ్యాధి వస్తుంది. ఈ వ్యాధికి గురైన ఆదర్శ్‌కు చిన్నప్పటి నుంచి ఎదుటివారు చెప్పింది వినపడేది కాదు. అలాగే మాట్లాడేవాడు కాదు. కుటుంబ సభ్యులు ఆదర్శ్‌ను చాలా మంది వైద్యుల వద్దకు తీసుకెళ్లాని ప్రయోజనం ఉండేది కాదు. అందులో కొందరు మాత్రం ఈ వ్యాధికి అమెరికాలో చికిత్స చేయించవచ్చని చెప్పారు. ఆదర్శ్ మామూలు మనిషిలా వినడం, మాట్లాడతాడని సంతోషించి అతడి తండ్రి ప్రదీప్ పాఠక్ తన భూమిని అమ్మి వచ్చిన డబ్బులతో వైద్యం కోసం అమెరికా తీసుకెళ్లాడు. అక్కడ ఆదర్శ తల లోపల, బయట వైద్యులు చిప్స్‌ను అమర్చారు. అప్పటి నుంచి సాధారణ మనుషుల్లాగా వినడం, మాట్లాడడం ప్రారంభించాడు. అంటే అచ్చం రోబోలా అన్నమాట. ఆ చిప్‌లు ఛార్జింగ్ అయిపోతే ఆదర్శ్ మాట్లాడలేదు. వినలేడు. బొమ్మలా సైలంట్‌గా ఉండిపోతాడు.
దూసుకెళ్తున్న ఆదర్శ్
ప్రస్తుతం ఆదర్శ్ క్రీడలు, చదువులో దూసుకెళ్తున్నాడు. సైన్స్ ఇంత పురోగతి సాధించడం పట్ల ఆదర్శ్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ్ వైద్యానికి రూ.2 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నా ఆదర్శ్‌కు అమర్చిన చిప్స్ సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేయడానికి, బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ప్రతి నెలా రూ.5 లక్షలు ఖర్చవుతోందని అతడి తల్లిదండ్రులు అంటున్నారు. ఇప్పటికే ఆదర్శ్ చికిత్స కోసం ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మేశామని తెలిపారు. సాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి సైతం విజ్ఞప్తి చేసినట్లు ఆదర్శ్ తండ్రి ప్రదీప్ పాఠక్ పేర్కొన్నారు.