Riding Bike Without Hands Balwinder Singh :74ఏళ్ల వయసులో బైక్‌పై స్టంట్స్ చేస్తూ ఔరా అనిపించారు పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. 112.4 కిలోమీటర్లు హ్యాండిల్‌ను చేతితో పట్టుకోకుండా బైక్‌ను నడిపారు. ఈ క్రమంలో ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఆయనే ఫరీద్కోట్ జిల్లాకు చెందిన బల్వీందర్ సింగ్.
తనకు 40 ఏళ్ల క్రితం నుంచి బైక్‌ను హ్యాండిల్‌ను పట్టుకోకుండా నడపాలనే కోరిక ఉందని వ్యాపారవేత్త బల్వీందర్ సింగ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందుకే బైక్‌పై స్టంట్స్ చేశానని తెలిపారు. తాను బైక్ నడుపుతున్నప్పుడు వీడియోను తీయించానని పేర్కొన్నారు. తనతో పాటు ఒక వ్యక్తి, అంబులెన్స్ కూడా ఉందని వెల్లడించారు.
"లైవ్ వీడియో తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపాను. 2023 నవంబర్ 16న మఖూ నుంచి బఠిండా వరకు మోటార్‌సైకిల్‌పై 112.4 కి.మీ ప్రయాణించి రికార్డు సాధించాను. బఠిండాలో ఓ గొయ్యి అడ్డు వచ్చింది. లేదంటే మరింత దూరం ప్రయాణించేవాడ్ని. భారత్‌లో ఇంత దూరం బైక్ హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడపిన వ్యక్తిని నేనే. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా తర్వాత లక్ష్యం 200కిలోమీటర్లు బైక్ హ్యాండిల్ పట్టుకోకుండా నడపడమే."
-బల్వీందర్ సింగ్, వ్యాపారవేత్త