Renuka Swamy Murder Case Forensic Report: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక పోలీసులకు అందింది. ఈ నివేదికను చూస్తే నిందితుల ఏ విధంగా క్రూరంగా వ్యవహరించారో తెలుస్తోందని సిట్ అధికారులు తెలిపారు. న్యాయస్థానంలో దాఖలు చేయనున్న అభియోగపత్రంతో పాటు ఈ రిపోర్ట్‌ను పొందుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ నివేదిక పేర్కొన్న విషయాలు
రేణుకాస్వామికి ఛాతీపై కొట్టడం వల్లే ఎముక విరిగి, ఊపిరితిత్తికి గుచ్చుకుందని ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు.'తలకు తీవ్ర గాయాలు కావడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగింది. ప్రమాద స్థలంలో ఉంచిన మినీ లారీకి రేణుక స్వామి తలను తీసుకువెళ్లి కొట్టడం వల్ల తలకు, వెన్నుపూసకు గాయాలయ్యాయి. కాలితో తన్నడం వల్ల మర్మావయాలకు తీవ్రగాయాలై, రక్తస్రావం కనిపించింది. మోకాలు విరిగింది. కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. చిత్రహింసలకు తాళలేక, శరీరం లోపల అవయవాలకు గాయాలు కావడం వల్లే అతను మరణించాడు' అని ఫోరెన్సిక్ నిపుణులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం రిపోట్తో మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక రూపొందించారు.