Ram Temple Portrait Made With Diamonds: అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా భక్తిని చాటుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక అరుదైన, వినూత్నమైన కళారూపాలను తయారు చేస్తూనే ఉన్నారు. అలానే సూరత్‌కు చెందిన ఓ కళాకారుడు వజ్రాలతో అయోధ్య రామమందిరం చిత్రాన్ని రూపొందించారు. 9,999 వజ్రాలతో ఆలయం, జై శ్రీరామ్, రాముడి చిత్రాల నమునాను తీర్చిదిద్దారు.
పెన్నిల్ కొనపై రాముడి చిత్రం
రాముడి చిత్రాన్ని పెన్సిల్ కొనపై చెక్కారు మహారాష్ట్రలోని జైపుర్‌కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ నవరత్న ప్రజాపతి. దీన్ని పూర్తి చేయడానికి ఐదు రోజులు పట్టిందని తెలిపారు. 'ఇది 1.3 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు బహుమతిగా ఇస్తాను. అలానే శ్రీరామ్ మ్యూజియంలో పెట్టేలా ప్రయత్నిస్తాను' అని ప్రజాపతి వెల్లడించారు.
'ఇది నాకు రెండో దీపావళి'
రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకను రెండో దీపావళి పండుగులాగా అనిపిస్తుంది అని ఆఫ్రికన్- అమెరికన్ నటి, గాయని మేరీ మిల్బెన్ అన్నారు. "జనవరి 22న నేను కూడా దీపావళిని జరుపుకుంటున్నాను. నేను ఇండియాలో లేనందుకు బాధగా ఉంది. కానీ కచ్చితంగా ఈ వేడుకను ఇక్కడ జరుపుకుంటాను. ఇది ప్రజలందరూ కలిసి జరపుకునే అద్భుతమైన క్షణం" అని మేరీ మిల్బెన్ చెప్పారు.
భద్రతా వలయంలోకి అయోధ్య
అలానే అయోధ్య భద్రతా మొత్తం బలగాలే చూసుకొనున్నారు. అయోధ్య ఏటీస్ కమాండోలు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ పహారాలో ఉంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సైతం రంగంలో దించారు.పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. జవనరి 23 వరకూ ఇదే పరిస్థితి కొనసాగించనున్నారు.