తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రిస్పీ పొటాటో లాలీపాప్స్​- ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తినడం పక్కా! - Best Snacks for Children

Best Snacks for Children: పిల్లల కోసం స్నాక్స్​ చేయాలనుకుంటున్నారా..? ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ సారి ఇవి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేట్​.. ఈ స్టోరీపై ఓ లుక్కేయండి...

Best Snacks for Children
Best Snacks for Children

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 5:16 PM IST

Evening Snacks for Children:పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్​ తినడం అలవాటు. అలా అని రోజూ ఒకటే పెడితే తినడానికి ఇష్టపడరు. ఈ క్రమంలో రోజూ వెరైటీలు చేయాలంటే అందరికి కుదరదు. కొద్దిమందికి చేయడం రాదు. అలాంటి వారి కోసమే ఇది. ఈ స్నాక్స్​ ఎవరైనా చేయొచ్చు. అందుకోసం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ స్నాక్స్​ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు వంటి వివ‌రాల‌ు ఈ స్టోరీలో చూద్దాం..

పొటాటో లాలీపాప్‌(Potato Lollipops)

కావలసిన పదార్థాలు:

  • బంగాళ దుంపలు – 2 (ఉడికించి, తొక్క తీసి మెత్తగా చేయాలి)
  • బ్రెడ్‌ పొడి – ఒకటిన్నర కప్పులు
  • ఉల్లిపాయ-1(సన్నగా తురుముకోవాలి)
  • పచ్చి మిర్చి తరుగు- ఒక టీ స్పూను
  • కొత్తిమీర – 2 టేబుల్‌ స్పూన్లు
  • పసుపు – చిటికెడు
  • కారం – టీ స్పూను
  • జీలకర్ర పొడి అర టీ స్పూను
  • ధనియాల పొడి – అర టీ స్పూను
  • ఉప్పు – తగినంత
  • చాట్‌ మసాలా – టీ స్పూను
  • అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను
  • నిమ్మ చెక్క – ఒకటి
  • మైదా పిండి – ఒక టేబుల్‌ స్పూను
  • నీళ్లు – తగినన్ని

తయారీ:

  • ఒక గిన్నెలో బంగాళ దుంప తురుము, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, చాట్‌మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, నిమ్మ రసం వేసి చపాతీ ముద్దలా బాగా కలపాలి
  • తర్వాత చేతికి కొద్దిగా నూనె అద్దుకుంటూ.. ఈ మిశ్రమాన్ని లాలీపాప్స్​ షేప్​లో చేసుకోవాలి.
  • తర్వాత ఒక పాత్రలో మైదాపిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి
  • ఇప్పుడు తయారు చేసిన లాలీపాప్స్​ను మైదా పిండిలో ముంచి, వెంటనే బ్రెడ్‌ పొడితో కోట్​ చేసుకోవాలి. అలా అన్ని బాల్స్​ను రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఈ బాల్స్‌ను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
  • ఈ బాల్స్‌కి పుల్లలు గుచ్చి లాలీపాప్‌లా చేసి, టమాట సాస్​తో తింటే సూపర్​గా ఉంటాయి.

చికెన్​ రెగ్యులర్​గా వండేస్తున్నారా? - ఈ సండే ఇలా చేయండి - కమ్మగా, కారంగా!

మిక్డ్స్​ వెజ్ లాలిపాప్(Mixed Veg Lollipops):

కావాల్సిన పదార్ధాలు

  • బంగాళాదుంప తురుము- 1 కప్పు
  • క్యారెట్ తురుము- అర కప్పు
  • క్యాబేజీ తురుము- అర కప్పు
  • ఫ్రెంచ్ బీన్స్ తరుగు- అరకప్పు
  • పచ్చిమిర్చి తరుగు-పావు కప్పు
  • ఉల్లిపాయ తరుగు-పావు కప్పు
  • నిమ్మరసం-1 టీ స్పూన్​
  • జీలకర్ర- 1/2 టీస్పూన్​
  • రెడ్ చిల్లి ఫ్లేక్స్- 1/2 టీస్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి-1/2 టీస్పూన్​
  • గరం మసాలా-1/2 టీస్పూన్​
  • ఉప్పు- తగినంత
  • కారం-1/2 టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు- 2 స్పూన్లు
  • ఐస్ పుల్లలు
  • నూనె- వేయించడానికి సరిపడా
  • పైన కోటింగ్ కోసం
  • మైదా- పావు కప్పు
  • బ్రెడ్ పొడి- అరకప్పు
  • సాల్ట్- కొద్దిగా
  • నీళ్లు- తగనన్ని

తయారీ విధానం:

  • స్టౌ మీద కడాయి పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి.. వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ సన్నని తరుగు వేపి పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • తరువాత క్యాబేజీ, క్యారెట్, బీన్స్ తరుగు వేసి ఓ మూడు నిమిషాలు వేయించుకోవాలి.
  • తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, చిల్లి ఫ్లేక్స్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకుని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఇప్పుడు బంగాళాదుంప తురుము వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్​ చేసి కొత్తిమీర తరుగు నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకుని దింపి చల్లార్చుకోవాలి.
  • చల్లారిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్​గా చేసుకోండి. తర్వాత ఆ బాల్స్​ను 30 నిమిషాలు ఫ్రిజ్​లో ఉంచండి.
  • ఇప్పుడు మైదాలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి దోశ పిండి లాగా కలుపుకోవాలి.
  • తర్వాత ఫ్రిజ్​లో నుంచి తీసిని బాల్స్​ను మైదా పిండిలో ముంచి ఆ తరువాత బ్రెడ్ పొడిలో 3-4 సార్లు కోట్ చేసుకోవాలి.
  • ఆ తరువాత ఐస్ పుల్ల గుచ్చి మరో సారి నెమ్మదిగా పుల్లకి అంటుకునేలా బాల్స్​ని సిద్ధం చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద బాండీ పెట్టి నూనె పోసి.. బాగా వేడెక్కిన తర్వాత అందులో రెడీ చేసుకున్న బాల్స్​ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం మంట మీదే ఫ్రై చేసుకోవాలి.
  • లాలిపాప్ బాగా క్రిస్పీగా వేగాక అప్పుడు టమాట సాస్​తో సర్వ్ చేసుకుంటే టేస్ట్​ అదిరిపోద్ది.
  • ఇకపోతే బ్రెడ్ పొడి బయట షాపుల్లో దొరుకుతుంది. ఒకవేళ బ్రెడ్ పొడి లేకపోతే మిల్క్ బ్రెడ్​ని దోరగా వేయించి.. అంచులు తీసేసి మిక్సీలో మెత్తని పొడి చేసి వాడుకోవచ్చు.

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details