తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువరాజుకు వయనాడ్​లో ఓడిపోతానని భయం- అందుకే రాయ్​బరేలీలో పోటీ' - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

PM Modi Attack On Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేయడంపై నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. వయనాడ్​లో ఓడిపోతాననే భయంతోనే యువరాజు(రాహుల్​ను ఉద్దేశించి) రాయ్ బరేలీలో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బంగాల్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో టీఎంసీ సర్కార్, కాంగ్రెస్​పై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI Photo)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 1:24 PM IST

Updated : May 3, 2024, 2:17 PM IST

PM Modi Attack On Rahul Gandhi :కాంగ్రెస్ యువరాజు( రాహుల్ గాంధీని ఉద్దేశించి) వయనాడ్​లో ఓడిపోతాననే భయంతో రాయ్ బరేలీ నుంచి బరిలోకి దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ చేయడానికి భయపడి రాయ్ బరేలీ నియోజకవర్గానికి రాహుల్ పారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం బంగాల్​లోని బర్ధమాన్-దుర్గాపుర్​లో ఎన్నికల ప్రసంగంలో కాంగ్రెస్, టీఎంసీ సర్కార్ పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

"కాంగ్రెస్ అగ్ర నాయకురాలు (సోనియా గాంధీని ఉద్దేశించి) ప్రత్యక్ష ఎన్నికల్లో పోరాడే ధైర్యం చేయరని నేను ఎప్పుడో పార్లమెంటులో చెప్పాను. ఆమె ప్రత్యక్ష ఎన్నికల నుంచి పారిపోయి రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వయనాడ్​లో రాహుల్ ఓడిపోతారని ముందే చెప్పాను. అందుకే యువరాజు రాయ్​బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో పోటీకి కూడా రాహుల్ భయపడ్డారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వమని నేను కాంగ్రెస్​కు సవాల్ చేశాను. కానీ వారు మౌనంగా ఉన్నారు. నాకు వ్యతిరేకంగా ఇచ్చిన 'ఓట్ జిహాద్' పిలుపుపై కాంగ్రెస్, టీఎంసీ మౌనంగా ఉన్నాయి. ఎందుకంటే వారు జిహాద్​కు మద్దతిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అతితక్కువ సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ చరిత్రలో ఈ ఎన్నికల్లో గెలిచేవే అతి తక్కువ సీట్లు." అని ప్రధాని మోదీ విమర్శించారు.

సందేశ్​ఖాలీ నిందితులను కాపాడుతున్న టీఎంసీ
తాను రాజకీయాల్లోకి ఆనందించడానికి రాలేదని, తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలనుకుంటున్నానని ప్రధాని మోదీ తెలిపారు. బంగాల్‌లో టీఎంసీ సర్కార్ హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేసిందని మండిపడ్డారు. సందేశ్​ఖాలీ అల్లర్ల నిందితుడు షేక్ షాజహాన్​ను బంగాల్ ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. టీఎంసీ సర్కార్​కు మానవత్వం కంటే బుజ్జగింపు రాజకీయాలే ముఖ్యమని ఆరోపించారు. భారత దేశం అభివృద్ధి చెందితే బంగాల్ ప్రజల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. దుర్గాపుర్​ను ప్రపంచం మొతం పారిశ్రామిక నగరంగా పిలవాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిపక్ష కూటమి తమ ఓటు బ్యాంకు రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఏదైనా చేస్తుందని మండిపడ్డారు.

25ఏళ్ల తర్వాత తొలిసారి- గాంధీల్లేకుండా అమేఠీలో పోటీ- కిశోరీ లాల్ గెలుస్తారా? - lok sabha elections 2024

కాంగ్రెస్ కంచుకోటలో రాహుల్‌ Vs దినేశ్‌- రాయ్​బరేలీలో హోరాహోరీ తప్పదా? - lok sabha elections 2024

Last Updated : May 3, 2024, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details