దేశంలో పెరిగిన నిరుద్యోగంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బడ్జెట్‌పై కూడా కేంద్రాన్ని నిలదీశారు.
'దేశంలో నిరుద్యోగం పెరిగింది'- ప్రభుత్వాన్ని నిలదీసిన ఆప్ ఎంపీ - Union Budget 2024 - UNION BUDGET 2024
Published : Jul 25, 2024, 10:14 AM IST
|Updated : Jul 25, 2024, 3:26 PM IST
Parliament Budget Session 2024 Live Updates :పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రెండో రోజు చర్చలు కొద్ది ప్రారంభం అయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విపక్ష పార్టీలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపించాయి. దీనిపై బుధవారం పార్లమెంట్లో కేంద్రంపై ఇండియా కూటమి నిరసనలు తెలిపింది. లోక్‌సభలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నివాదాలతో హోరెత్తించారు. రాజ్యసభలో విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. గురువారం కూడా అదే అంశాన్ని లేవనెత్తేందుకు ఇండియా కూటమి సద్ధిమైంది.
LIVE FEED
బీజేపీ ఎంపీగా ఎన్నికైన తర్వాత కంగనా రనౌత్ లోక్‌సభలో మొదటిసారిగా సమస్యలపై ప్రశ్నలు అడిగారు. హిమాచల్‌లో ఉన్న గిరిజన సాంప్రదాయ కళలు అంతరించిపోయే దశలో ఉన్నాయని, గిరిజనలను ప్రోత్సహించడానికి, వాటిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పమని సంబంధిత మంత్రిని కోరారు.
విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయ పనుల జాప్యంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. దేశానికి విమాన సర్వీసులు కొత్త రైల్వేలు లాంటిది అని ఆయన అన్నారు. సుమారు రూ. 611 కోట్ల వ్యయంతో ఈ పని 2020లో ప్రారంభం కాగా, కోవిడ్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని ఆయన చెప్పారు. ఈ విషాయన్ని ఇప్పుడు మేమ టాప్ ప్రియారిటీగా తీసుకున్నాం. 2025 జూన్ కల్లా దాన్ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని రామ్మోహన్ అన్నారు.
లోక్‌సభలో వివిధ అంశాలపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.
చైనాతో సరిహద్దు వివాదం, వాణిజ్య లోటుపై చర్చ జరపాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.