రాజ్యసభలో విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
బడ్జెట్‌పై అసహనం- లోక్‌సభలో నినాదాలతో హోరెత్తించిన ఇండియా కూటమి- రాజ్యసభలో విపక్ష సభ్యుల వాకౌట్ - Union Budget 2024 - UNION BUDGET 2024
Published : Jul 24, 2024, 10:16 AM IST
|Updated : Jul 24, 2024, 12:25 PM IST
Parliament Budget Session 2024 Live Updates :పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుధవారం చర్చ కాసేపట్లో ప్రారంభం అయింది. దీనిపై ఉభయ సభల్లో 20గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు విపక్ష పార్టీలు పరిపాలించే రాష్ట్రాలపై బడ్జెట్‌లో వివక్ష చూపించారని ఎన్డీఏకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
LIVE FEED
ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంట్లో విపక్ష పార్టీలు నినాదాలతో హోరెత్తిస్తున్నాయి.
ఇండియా కూటమి సభ్యుల నిరసన
ప్రతిపక్ష పార్టీలు అధికారంలో రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటంతోపాటు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ జయాబచ్చన్, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు
ఇది అన్యాయమైన బడ్జెట్ : గౌరవ్ గొగోయ్
2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అన్యాయమైన బడ్జెట్‌గా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అభివర్ణించారు. చాలా రాష్ట్రాల ఆందోళనలను ఈ బడ్జెట్‌లో విస్మరించారన్నారు. కేవలం అధికారం కాపాడుకోవడం కోసం తీసుకొచ్చిన బడ్జెట్ అని అన్నారు. రాష్ట్రాల స్థానిక అవసరాలని పట్టించుకోలేదని చెప్పారు. అందుకే ఇండియా కూటమి నిరసన తెలుపుతోందన్నారు. ఈ మేరకు పార్లమెంట్ గేటు వద్ద ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలుపుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు.