Parents Killed Son In Indore :సొంత కుమారుడిని అతడి తల్లిదండ్రులే చంపి గోనె సంచిలో చుట్టి బయట పడేశారు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కన్న తల్లిపై అత్యాచారానికి పాల్పడడం వల్లే కుమారుడిని అతడి తల్లిదండ్రులు హత్య చేశారని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
ఇందౌర్‌లోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 26న గోనె సంచిలో చుట్టి ఉన్న ఓ మృతదేహం పారిశుధ్య కార్మికులకు కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి మెడలో ఓం లాకెట్ ఉంది. అలాగే మృతుడి శరీరంపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉంచిన గోనె సంచిపై ఉన్న అడ్రస్‌ను బట్టి నిందితులను పట్టుకోగలిగారు.
'ఏప్రిల్ 26న గోనె సంచిలో గుర్తు తెలియని మృతదేహాం కనిపించింది. మృతదేహాన్ని పెట్టిన గోనె సంచి జైన్ నమ్కీన్ అనే వ్యాపారి దుకాణం నుంచి ఏప్రిల్ 17న నిందితులు కొనుగోలు చేశారు. ఇదే నిందితులను పోలీసులు గుర్చించడానికి ఉపయోగపడింది. మృతుడు సుధాన్షు ఇటుక బట్టీలో కూలీ. ఏప్రిల్ 24న కన్నతల్లిపైనే సుధాన్షు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని భర్తకు బాధితురాలు తెలియజేసింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలిసి రాత్రి 3 గంటల సమయంలో సుధాన్షును సుత్తి, స్క్రూడ్రైవర్‌తో కొట్టి హత్య చేశారు. అనంతరం కొడుకు మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. దుర్వాసన రావడం వల్ల ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున బైక్‌పై మృతదేహాన్ని సుధాన్షు తండ్రి రాజారామ్ నిర్జీవ ప్రదేశంలో పడేశాడు. సమీపంలో ఉన్న సీసీటీవీలో నిందితుడు మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సుధాన్షు తండ్రి రాజారామ్‌ను అరెస్ట్ చేశాం. సుధాన్షు తల్లిని నిందితురాలిగా చేర్చాం'
--వినోద్ కుమార్ మీనా, ఇందౌర్ డీసీపీ
ప్రేమను అంగీకరించలేదని చికెన్ రైస్ లో విషం
తన ప్రేమకు అడ్డు చెప్పారని కన్న తల్లి సహా కుటుంబ సభ్యులను హతమార్చేందుకు చికెన్ రైస్‌లో విషం కలిపింది ఓ యువతి. దీంతో చికెన్ రైస్ తిన్న యువతి తల్లి, తాత మరణించారు. ఈ ఘటన తమిళనాడులోని నమక్కల్ లో జరిగింది.