తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్‌ జైలు నుంచి 22 మంది భారతీయ మత్స్యకారులు విడుదల - INDIAN FISHERMEN RELEASED PAKISTAN

పాక్​ జైలు నుంచి భారతీయ మత్స్యకారులు విడుదల- 22మందిని విడుదల చేసిన పాకిస్థాన్

Indian Fishermen Released Pakistan Jail
Indian Fishermen Released Pakistan Jail (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2025, 11:22 AM IST

Indian Fishermen Released Pakistan Jail : పాకిస్థాన్‌ జైలు నుంచి 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తి కావడం వల్ల కరాచీలోని మాలిర్ కారాగారం నుంచి శుక్రవారం బయటకు వచ్చారు. ఈ రోజే ఆ మత్స్యకారుల్ని భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ క్రమంలో భారత జాలర్లకు ఈది ఫౌండేషన్ సహాయసహకారాలు అందించింది. వారు కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లడానికి కావాల్సిన రవాణా సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి వారు భారత్‌కు రానున్నారు. ఆ సంస్థ మత్స్యకారులకు ప్రయాణ ఖర్చులు, కొన్ని బహుమతులు, నగదు అందించింది. ఈ సందర్భంగా భారత్‌-పాక్‌ ప్రభుత్వాలకు ఈది ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది ఒక అభ్యర్థన చేశారు. ఎలాంటి దురుద్దేశం లేకుండా పొరపాటున అంతర్జాతీయ జలాల సరిహద్దులు దాటుతున్న వారిపై దయతో వ్యవహరించాలని అభ్యర్థించారు.

వాఘా సరిహద్దు ద్వారా పాక్‌ అధికారులు ఈ జాలర్లను భారత్‌కు అప్పగిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన తర్వాత మన అధికారులు వారిని స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లుచేస్తారు. మత్స్యకారులు సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్ల ఇరువైపులా ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలాఉంటే జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. పాకిస్థాన్‌లో 266 మంది భారత ఖైదీలు ఉన్నారు. భారత జైళ్లలో మొత్తం 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు మన దేశ జాబితా పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details