Padma Awards 2024 :ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు కేంద్ర ప్రభుత్వం ఐదుగురిని ఎంపిక చేసింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితోపాటు మెగాస్టార్ చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్, వైజయంతిమాల బాలికి, పద్మాసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ ప్రకటించింది. మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు అనౌన్స్ చేసింది.గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి, తెలంగాణలో నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ పద్మశ్రీ అవార్డుల జాబితా గురువారం రాత్రి విడుదలైంది.
పద్మవిభూషన్ అవార్డు గ్రహీతలు
- వైజయంతి మాల (కళలు) - తమిళనాడు
- కొణిదెల చిరంజీవి (కళలు) - ఆంధ్రప్రదేశ్
- ఎమ్ వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు) - ఆంధ్రప్రదేశ్
- బిందేశ్వర్ పఠక్ (సామాజిక సేవా) - బిహార్
- పద్మ సుబ్రమణ్యం (కళలు) - తమిళనాడు
పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు
- ఎం.ఫాతిమా బీవీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - కేరళ
- సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు - బంగాల్
- రామ్ నాయక్ (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
- ఓలాంచెరి రాజగోపాల్ (ప్రజావ్యవహారాలు) - కేరళ
- హోర్ముస్ట్రీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం) -మహారాష్ట్ర
- కుందన్ వ్యాస్- మహారాష్ట్ర
- మిథున్ చక్రవర్తి (కళలు) - బంగాల్
- దత్తాత్రేయ్ అంబాదాస్ మాయాలూ (కళలు) - మహారాష్ట్ర
- అలియాస్ రాజ్త్ ప్యారేలాల్ శర్మ (కళలు) - మహారాష్ట్ర
- ఉషా ఉధుప్ (కళలు) - బంగాల్
- విజయకాంత్ (మరణానంతరం) (కళలు) - తమిళనాడు
- సీతారాం జిందాల్ (వాణిజ్యం, పరిశ్రమలు)- కర్ణాటక
- యాంగ్ లియు (వాణిజ్యం, పరిశ్రమలు) - తైవాన్
- అశ్విన్ బాలాచంద్ మెహతా (వైద్యం) - మహారాష్ట్ర
- తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం) - గుజరాత్
- చంద్రేశ్వర్ ప్రసాద్ రాకుర్ (వైద్యం) - బిహార్
- తొగ్దాన్ రిన్పొఛె (ఆధ్యాత్మికత) - లద్దాఖ్