తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్​ ఆఫర్​- ఏటా రూ.10వేల స్కాలర్​షిప్​! - new scheme in odisha

Odisha Govt Scholarship : డిగ్రీ, పీజీ చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం కొత్త స్కాలర్​షిప్​ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా రూ.9వేలు, విద్యార్థినులకు రూ.10వేలు చొప్పున అందించనుంది.

odisha scholar ship
odisha scholar ship

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 9:49 PM IST

Updated : Feb 13, 2024, 10:20 PM IST

Odisha Govt Scholarship :సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం కొత్త స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద అబ్బాయిలకు ఏటా రూ.9వేలు, విద్యార్థినులకు రూ.10వేల చొప్పున స్కాలర్​షిప్​ను అందించనుంది. SC,ST, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులైతే 10 వేల రూపాయలు, విద్యార్థినులైతే రూ.11వేల చొప్పున అందిస్తారు.

ఈ మేరకు జజ్‌పుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో 5T ఛైర్‌పర్సన్‌ వీకే పాండియన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆదాయపు పన్ను చెల్లించినా, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులైనా వారు స్కాలర్‌షిప్‌నకు అనర్హులని తెలిపారు.

లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
Odisha Nua O Scholarship :నూతన ఉన్నత అభిలాష NUA-ఒడిశా పేరిట ఈ పథకం అమలు కానుంది. 2023-24 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.385 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకం 30 జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ఒడిశాలో 4.5లక్షల మంది డిగ్రీ విద్యార్థులు, 32వేల మంది పీజీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల విద్యార్థులతో పాటు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలోని సంస్కృత కళాశాలలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత అకాడమిక్​ ఇయర్​కు సంబంధించి ఈ స్కాలర్​షిప్​ నగదును ఫిబ్రవరి 20 నుంచి అర్హులైన విద్యార్థుల బ్యాంకు అకౌంట్లలో జమచేయనున్నారు. న్యూ ఒడిశా దిశగా ముఖ్యమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా విద్యార్థుల సాధికారతకు ఇది ఓ నూతన శకం అని పాండియన్ తెలిపారు.

'విద్యార్థులకు మ్యాజిక్​ స్మార్ట్​ కార్డులు'
'రూ.300 కోట్ల కార్పస్​ ఫండ్స్​తో ఆగస్టు నాటికి అర్హత కలిగిన విద్యార్థులందరికీ NUA-o 'మ్యాజిక్ స్మార్ట్​​ కార్డుల'ను ఇస్తాం. వాటి ద్వారా వారు బస్సు లేదా రైలు ప్రయణాలతో పాటు ఉచిత వైఫై సౌకర్యం, ఆన్​లైన్​ కోర్సులు, స్కిల్​ డెవలప్​మెంట్​, కోచింగ్​ లాంటి అదనపు ప్రయోజనాలును పొందడానికి అవకాశం ఏర్పడుతుంది' అని పాండియన్​ వివరించారు.

పేద విద్యార్థులకు LIC స్కాలర్​షిప్​ - అప్లై చేసుకోండిలా!

పేద విద్యార్థులకు SBI స్కాలర్​షిప్​ - నవంబర్ 30 లాస్ట్ డేట్!

Last Updated : Feb 13, 2024, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details