Doctors Safety Rules And Regulations :పనిప్రదేశంలో వైద్యుల భద్రతకు సంబంధించిన ప్రోటోకాల్‌ను నేషనల్ టాస్క్‌ఫోర్స్ రూపొందించే లోగా ఈ అంశంపై కేంద్రం, రాష్ట్రాలకు పలు సూచనలు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వైద్యారోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు లేఖ రాశారు. వైద్యారోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రం పేర్కొంది.
రాత్రి వేళల్లో క్యాంపస్‌లోని!
ఆస్పత్రుల్లోని కీలక ప్రదేశాల్లో సాధారణ ప్రజలు, రోగుల బంధువుల కదలికలపై నియంత్రణ ఉంచి విజిటర్ పాస్ పాలసీని కఠినంగా అమలు చేయాలని సూచించింది. ఆస్పత్రుల్లో హింసాత్మక ఘటనల నియంత్రణ వైద్యుల భద్రత కోసం అమలు చేయాల్సిన వ్యూహాల కోసం సీనియర్ వైద్యులు, పాలనాధికారులతో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. రాత్రి వేళల్లో క్యాంపస్‌లోని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రెసిడెంట్ డాక్టర్లు, నర్సులు సురక్షితంగా వెళ్లేలా సదుపాయాలు కల్పించాలని కేంద్రం నిర్దేశించింది.