రైల్వే స్టేషన్లో వ్యక్తి బీభత్సం- కర్రతో ప్రయాణికులపై దాడి- ఇద్దరు మృతి - Man Attacked Passengers In Nagpur - MAN ATTACKED PASSENGERS IN NAGPUR
Man Attacked Passengers In Nagpur : మహారాష్ట్రలోని నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. కర్రతో ప్రయాణికులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
![రైల్వే స్టేషన్లో వ్యక్తి బీభత్సం- కర్రతో ప్రయాణికులపై దాడి- ఇద్దరు మృతి - Man Attacked Passengers In Nagpur Man Attacked Passengers In Nagpur Railway Station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-10-2024/1200-675-22624622-thumbnail-16x9-nagpurmurder.jpg)
Published : Oct 7, 2024, 11:30 AM IST
|Updated : Oct 7, 2024, 11:38 AM IST
Man Attacked Passengers In Nagpur Railway Station :మహారాష్ట్రలోని నాగ్‌పుర్ రైల్వే స్టేషన్లో మతిస్థిమితం లేదని భావిస్తున్న ఓ వ్యక్తి చేసిన దాడిలో ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరిని తమిళనాడు దిండిగల్‌కు చెందిన గణేశ్ కుమార్‌గా గుర్తించారు. మరో బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రైల్వే ట్రాక్‌ల్లో ఉపయోగించే కర్రతో ఏడో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై వేచిచూస్తున్న ప్రయాణికులపై నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడి చేసి పారిపోతున్న నిందితుడిని రైల్వే ఉద్యోగులు పట్టుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.