తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీల్ మేకర్ ఫ్రైడ్​ రైస్ - ఇంట్లోనే సూపర్ క్వాలిటీగా - ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బలాదూర్! - MEAL MAKER FRIED RICE PROCESS - MEAL MAKER FRIED RICE PROCESS

MEAL MAKER FRIED RICE MAKING PROCESS : స్పైసీ అండ్ టేస్టీ ఫుడ్ కావాలంటే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ను మించిన ఆప్షన్ లేదని అనుకుంటారు చాలా మంది. కానీ.. ఇంట్లోనే అద్దిరిపోయే సూపర్ ఫాస్ట్ ఫుడ్ ను తయారు చేయొచ్చు. అదే.. "మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్". చూస్తేనే నోరు ఊరిపోయే ఈ రెసిపీని తయారు చేసేద్దామా!

MEAL MAKER FRIED RICE
MEAL MAKER FRIED RICE MAKING PROCESS (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 4:25 PM IST

MEAL MAKER FRIED RICE MAKING PROCESS : నేటి యువతకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ "ఫ్రైడ్​ రైస్". అందుకే.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లి.. ఎగ్ ఫ్రైడ్ రైస్‌, చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేస్తుంటారు. అయితే.. బయట శుభ్రతపై, క్వాలిటీపై టెన్షన్ ఉంటుంది. ఈ ఆందోళన లేకుండా.. ఇష్టంగా ఇంట్లోనే ఫ్రైడ్​ రైస్​ టేస్ట్ చేయొచ్చు. మీల్ మేకర్​తో తయారు చేసే ఈ ఫుడ్.. మీతో అదుర్స్ అనిపిస్తుందంటే నమ్మాల్సిందే. మరి.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారీకి అవసరమైన పదార్థాలు..

మీల్ మేకర్ - 1 కప్పు

బాస్మతి బియ్యం - 1 కప్పు

ధనియాల పౌడర్ - 1/2 స్పూన్

కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్లు

ఆయిల్ - సరిపడా

కారం - 1/2 స్పూన్

గ్రీన్ చిల్లీ - 3

అల్లం పేస్ట్ - ఒకటిన్నర స్పూన్

క్యాప్సికమ్ - 1

రెడ్ చిల్లీ సాస్ - 1 స్పూన్

సోయా సాస్ - 1 స్పూన్

మిరియాల పౌడర్ - 1/2 స్పూన్

వెనిగర్ - 1 స్పూన్

సాల్ట్ - సరిపడా

తయారు చేసే విధానం..

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని కుక్ చేయాలి. ఫ్రైడ్​ రైస్​కు తగినట్టు అన్నం పొడిపొడిగా ఉండాలి.
  • అన్నం కుక్ చేసేటప్పుడే స్పూన్ అయిల్, తగినంత ఉప్పు వేస్తే.. అన్నం పొడిపొడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
  • ఇప్పుడు అన్నం కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి.
  • ఈ లోగా మీల్ మేకర్లను వేడి నీటిలో వేసి, సుమారు 10 నిమిషాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల అవి స్మూత్​గా మారతాయి.
  • తర్వాత మీల్ మేకర్లను వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకుంటున్నప్పుడు చేత్తో నీళ్లను పూర్తిగా పిండేయండి.
  • మీల్​ మేకర్లు వేసిన గిన్నెలోనే.. కారం, ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత.. కార్న్ ఫ్లోర్‌ కూడా వేయండి. (కావాలనుకుంటే ఒక స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు)
  • ఈ పదార్థాలన్నీ మీల్ మేకర్‌కు బాగా పట్టేలా కలిపి.. పది నిమిషాలపాటు పక్కన పెట్టండి.
  • తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి, డీప్ ఫ్రై చేయడానికి అవసరమైనంత ఆయిల్ వేయండి.
  • ఇప్పుడు.. మారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్లు ఆయిల్​లో వేసి, ఫ్రై చేసి, పక్కన పెట్టుకోండి. టిష్యూ పేపర్ మీద వేసి, ప్రెస్​ చేస్తే.. నూనె వెళ్లిపోతుంది.
  • ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి వేయించండి. తరిగిన క్యాప్సికం, మిగిలిన అల్లం పేస్ట్ కూడా వేసి కాసేపు ఫ్రై చేయండి. (క్యాప్సికం కాకపోతే క్యాబేజీ, క్యారెట్ కూడా వాడొచ్చు).
  • వీటిని వేయిస్తున్నప్పుడే.. సోయాసాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ వేయండి. అయితే.. ఈ సాసులు వేగంగా అడుగంటుతాయి. కాబట్టి.. వెంటనే స్టౌ సిమ్​లో పెట్టి, రెండు స్పూన్ల వాటర్ వేయాలి.
  • తర్వాత ఇందులో.. ఫ్రై చేసి పక్కన పెట్టిన మీల్ మేకర్స్ వేసి కలుపుకోండి. తర్వాత మిరియాల పొడి చల్లుకోండి. అవసరాన్ని బట్టి ఉప్పు వేయాలి.
  • ఇప్పుడు.. ఈ మిశ్రమంలో ఉడికించిన అన్నం వేసి మిక్స్ చేయండి. ఆ తర్వాత పైన కొత్తిమీర వేసి, ప్లేట్లోకి తీసుకోండి. అద్దిరిపోయే ఫ్రైడ్​ రైస్​ ఘుమఘుమలాడుతూ మీ కళ్ల ముందు కనిపిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details