Mango Special Recipes for Summer Season :పండ్లలో రారాజుగా చెప్పుకొనే మామిడిని ఆస్వాదిస్తే ఆ కిక్కే వేరు. అయితే.. మామిడిని చాలా మంది నేరుగా లాగిస్తారు. లేదంటే లస్సీ, సలాడ్స్ వంటివి తయారు చేసుకుంటారు. కానీ.. మామిడితో పులావ్ చేయొచ్చని మీకు తెలుసా? జిలేబీ కూడా తయారు చేయొచ్చని తెలుసా? తక్కువ మందికి మాత్రమే ఈ రెసిపీ తెలిసి ఉంటుంది. మీరు ఇప్పటి వరకూ ట్రై చేయకపోతే మాత్రం ఈ సారి తప్పకుండా టేస్ట్ చేయండి. మరి.. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మ్యాంగో జిలేజీ(Mango Jalebi) :
కావాల్సిన పదార్థాలు :
- పండిన మామిడికాయ - 1
- చక్కెర - 200 గ్రాములు
- కేసర్ - 1 గ్రాము
- వాటర్ - 250 గ్రాములు
- మైదా - 200 గ్రాములు
- నెయ్యి - 300 గ్రాములు
- తరిగిన డ్రై ఫ్రూట్స్- 1 కప్పు.
తయారీ విధానం :
- మామిడి జిలేబీలను ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ముందురోజే కలిపి పులియబెట్టుకుంటే జిలేబీలు సూపర్‌గా వస్తాయి! కాబట్టి ఇందుకోసం.. మీరు ఒక రోజు ముందుగానే మైదా, తగినంత నీటిని కలిపి పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇక నెక్ట్స్ డే మామిడి జిలేబీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్రలో చక్కెర, అందుకు తగినంత వాటర్ వేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి. పాకం వచ్చాక దానిలో కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి.
- ఇప్పుడు పండి మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మరో పాన్‌లో నెయ్యి వేసి కాస్త హీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు మామిడి ముక్కలను.. ముందురోజు ప్రిపేర్ చేసుకున్న పిండిలో ముంచితీసి పాన్ మీద వేసి వేయించుకోవాలి.
- అలా వేయించిన మామిడికాయ ముక్కలను చక్కెర పాకంలో ముంచి బయటకు తీయండి.
- ఆపైన తరిగిన డ్రై ఫ్రూట్స్ చల్లి వేడి వేడిగా వడ్డించండి. అంతే.. నోరూరించే మ్యాంగో జిలేబీలు రెడీ!