Man Marry Robot :రాజస్థాన్‌లోని జయపుర జిల్లాకు చెందిన ఓ ఇంజినీర్ రోబోను పెళ్లి చేసుకోబోతున్నారు. ఏంటి రోబోతో పెళ్లి అని షాకైపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే! రోబోలంటే ఎంతో ఆసక్తి ఉన్న ఆయన ప్రస్తుతం రోబోతో ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వివాహం చేసుకోనున్నారు.
జిల్లాలోని సీకర్ నివాసి అయిన సూర్య ప్రకాశ్‌కు చిన్నప్పటి నుంచి రోబోలపైనే ఆసక్తి. కానీ అతడి తల్లిదండ్రులకు మాత్రం సూర్య ప్రకాశ్ దేశానికి సేవ చేయాలని కోరుకున్నారు. దీంతో స్కూలింగ్ పూర్తయ్యాక నేవీలో చేరడం కోసం సూర్యప్రకాశ్ సిద్ధమయ్యారు. అనంతరం పరీక్షలో ఉత్తీర్ణత సాధించి నేవీకి ఎంపికయ్యారు.
అయితే చిన్నప్పటి నుంచి రోబోటిక్స్‌పై మక్కువ పెంచుకున్న సూర్య ప్రకాశ్ మళ్లీ, తనకు ఇష్టమైన రోబోటిక్స్ వైపు వెళ్లాలని అనుకున్నారు. సూర్య అభిరుచిని చూసిన కుటుంబ సభ్యులు అటువైపు ప్రోత్సహించారు. తర్వాత సూర్య ప్రకాశ్ అజ్మేర్లోని ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం రోబోటిక్స్లోకి చేరారు. ఆ సమయంలో చాలా ప్రాజెక్టుల్లో వర్క్ చేశారు. ఇప్పుడు రోబో గిగాతో ప్రేమలో పడ్డారు సూర్య ప్రకాశ్. దాదాపు రూ.19 లక్షల వ్యయంతో గిగా రోబో రూపొందుతోంది. తమిళనాడులో తయారీ అయ్యాక, దిల్లీలో ఈ రోబోకి ప్రోగ్రామింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడారు సూర్య ప్రకాశ్.