Mallikarjun Kharge On BJP :2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకుండా హస్తం పార్టీ, ఇండియా కూటమి ఆపగలదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఇండియా కూటమి పట్ల ప్రజల అభిప్రాయం గణనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ద్వేషం, విభజన వ్యాప్తి చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారని తెలిపారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లికార్జున ఖర్గే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చే
కేంద్రంలో బీజేపీ సర్కార్ రాదు!
"ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు పోరాడుతున్నారు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. రామాలయం, హిందూ-ముస్లిం విభజన, భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల పేరుతో బీజేపీ పదేపదే ప్రజలను ఎమోషనల్గా మోసం చేసింది. ఇప్పుడు ప్రజలు బీజేపీ అసలు రంగును అర్థం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం తర్వాత మాకు అర్థమైంది. ఇండియా కూటమికి లోక్సభ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలకు ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయి. బీజేపీకి మెజారిటీ సీట్లు రాకుండా ఆపగలుగుతాం. బీజేపీ ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదు. విపక్ష కూటమి తరఫున ప్రజలు పోరాడుతున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో వెనుకంజలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కీలకమైనవి. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సి ఉంది" అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల్లో ఆ రెండే ప్రధాన అంశాలు
2024 లోక్ సభ ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా మారాయని ఖర్గే ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను కూడా బీజేపీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలు బీజేపీ ఉద్దేశాలను అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం అనే రెండు ప్రధాన అంశాలు కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు.
"రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. 400 సీట్లు గెలిపించాలని బీజేపీ పదేపదే చెబుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని వారు తీసేయలేరు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది. పలు పదవుల్లో ఆర్ఎస్ఎస్కు వ్యక్తులను నియమించాలనుకుంటుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మణిపుర్, ఉత్తరాఖండ్, గోవాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బంది పెట్టింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూడా అంగీకరించదు. అందుకే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోంది. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే ఈ ఎన్నికలు ప్రజలకు చాలా ముఖ్యమైనవి"