తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టైలర్​ షాప్​లో ఘోర అగ్ని ప్రమాదం- ఒకే కుటుంబంలోని ఏడుగురు మృతి - Maharashtra Fire Accident - MAHARASHTRA FIRE ACCIDENT

Maharashtra Fire Accident Today : మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.

Maharashtra Fire Accident Today
Maharashtra Fire Accident Today

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 7:11 AM IST

Updated : Apr 3, 2024, 10:00 AM IST

Maharashtra Fire Accident Today : మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని ఓ టైలర్​ షాప్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతదేహాలను జిల్లా ప్రభుత్వాసుపత్రికి శవపరీక్షల కోసం తరలించారు.

కంటోన్మెంట్​ ప్రాంతంలోని జైన దేవాలయం సమీపంలో ఉన్న ఓ భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అసిం వసీం షేక్​ (3), పరి వసీం షేక్​ (2), వసీం షేక్ (30), తన్వీర్​ వసీం (23), హమీదా బేగం (50), షేక్​ సోహేల్​ (35), రేష్మా షేక్​ (22)ను మృతులుగా పోలీసులు గుర్తించారు.

"బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో దర్జీ దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సంబంధిత శాఖల అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. మాకు సహాయంగా స్థానికులు కూడా ఓ చేయి కలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నాం. విచారణ జరుగుతోంది. దర్యాప్తులో అగ్నిప్రమాదానికి గల కారణాలేమిటో తెలుస్తాయి"

- మనోజ్​ లేహియా, ఔరంగాబాద్​ సీపీ

ఘటనాస్థలికి ఎంపీ అభ్యర్థి
ఈ ఘటనపై జిల్లా లోక్​సభ అభ్యర్థి, మాజీ ఎంపీ చంద్రకాంత్​ కైరే స్పందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 'రంజాన్ మాసంలో దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరం. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు తెల్లవారుజామునే నిద్రలేస్తారు. కానీ, బుధవారం వారు నిద్రలేవకముందే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కింది అంతస్థులో ఉన్న టైలర్​ షాప్​లోని బట్టలు, ఫర్నీచర్​ కారణంగా మంటలు పై అంతస్థులకు వేగంగా వ్యాపించాయి. దీంతో ఇంటిలోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది' అని మీడియాతో చెప్పారు. అయితే ఈ ప్రమాదం తన ఎలక్ట్రిక్​ వాహనానికి పెట్టిన ఛార్జింగ్​ కారణంగానే సంభవించి ఉంటుందని ప్రత్యక్ష సాక్షి సచిన్​ దుబే తెలిపారు.

భవనంలో చెలరేగిన మంటలు- ఇద్దరు బాలికలు సహా నలుగురు మృతి

రైలు నుంచి TTEని తోసేసిన 'టికెట్‌' లేని వ్యక్తి- మరో ట్రైన్​ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి - Passenger Pushed TTE From Train

Last Updated : Apr 3, 2024, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details