తెలంగాణ

telangana

ETV Bharat / bharat

44 రోజుల ప్రక్రియ- తొలి లోక్​సభ ఎన్నికల తర్వాత ఇప్పుడే ఎక్కువ! - Loksabha Election 2024

Loksabha Election 2024 Voting Period : దేశంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఏడు దశల్లో 44 రోజులపాటు సాగనుంది. అయితే తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్న ఎన్నికలు ఇవే. అప్పుడు ఎన్ని రోజులపాటు ప్రక్రియ జరిగిందంటే?

Loksabha Election 2024 Voting Period
Loksabha Election 2024 Voting Period

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:02 PM IST

Loksabha Election 2024 Voting Period : దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. త్వరలోనే ఓట్ల జాతర జరగనుంది. అయితే లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఏప్రిల్‌ 19వ తేదీన మొదలు జూన్‌ 1వ తేదీన వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించనుంది. స్వతంత్ర భారత దేశంలో 1951-52లో తొలి పార్లమెంటు ఎన్నికల తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం సాగనున్నవి ఇవే కావడం గమనార్హం.

అయితే తొలి పార్లమెంట్ ఎన్నికలు నాలుగు నెలలకుపైగా సాగాయి. అప్పుడు ఏకంగా 68 దశల్లో పోలింగ్‌ నిర్వహించింది ఎన్నికల సంఘం. ఇక 1980లో కేవలం నాలుగు రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు ముగియడం గమనార్హం. అత్యంత తక్కువ కాలం ఇదే. ఈసారి ఈసీ షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి జూన్‌ 4న ఓట్ల లెక్కింపు వరకు ఈసారి ప్రక్రియ మొత్తం 82 రోజులు సాగనుంది.

'అన్నీ పరిగణనలోకి తీసుకునే నిర్ణయం'
ఇంత సుదీర్ఘ కాలం ఎందుకు నిర్వహిస్తున్నారనే దానిపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై సీఈసీ రాజీవ్‌కుమార్‌ బదులిచ్చారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, సెలవులు, పండగలు, పరీక్షల వంటివి పరిగణనలోకి తీసుకుని తేదీలు నిర్ణయించినట్లు చెప్పారు. భద్రత బలగాల తరలింపునూ దృష్టిలో ఉంచుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఒకరికి అనుకూలంగా లేదా ఒకరికి వ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని స్పష్టం చేశారు. బంగాల్‌, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికల నిర్వహణపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

దేశంలో మొదటి సాధారణ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి ఫిబ్రవరి 21, 1952 వరకు సాగింది. ఇప్పటివరకు ఇదే సుదీర్ఘమైనది. 1962 నుంచి 1989 మధ్యకాలంలో నాలుగు రోజుల నుంచి 10 రోజుల మధ్య ఉంది. 1980లో జనవరి 3 నుంచి 6వ తేదీవరకు నాలుగు రోజుల్లోనే ముగిశాయి. 2004లో నాలుగు దశలకు 21 రోజులు పట్టింది. 2009లో ఐదు దశలు నెల పాటు కొనసాగాయి. 2014లో తొమ్మిది దశల్లో ఎన్నికలకు 36 రోజులు పట్టింది. 2019లో 39 రోజుల పాటు ఏడు దశల్లో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details