Lok Sabha Polls Results 2024 Congress Record: లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమికి మెజార్టీ సీట్లు దక్కడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రికార్టు సాధించింది. 1984 లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది. 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన భారీగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఆ తర్వాత అంతగా రాణించలేకపోయింది. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది.
ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్ 13.63 కోట్లకు పైగా ఓట్లను సాధించింది. బీజేపీ 23.45 కోట్ల ఓట్లను పొందింది.
కాంగ్రెస్, బీజేపీ ఓట్లు
Year | Total Votes(crore) | Congress Votes(crore) | BJP Votes(crore) |
---|---|---|---|
1984-85 | 24.97 | 12.01 (48.10%) | 1.84 (7.40%) |
1989 | 30.09 | 11.88(39.50%) | 3.41 (11.40%) |
1991-92 | 27.42 | 9.98 (36.40%) | 5.58 (20.07%) |
1996 | 33.49 | 9.64 (28.80%) | 6.79 (20.29%) |
1998 | 36.83 | 9.51 (25.82%) | 9.42 (25.59%) |
1999 | 36.43 | 10.31 (28.30%) | 8.65 (23.75%) |
2004 | 38.97 | 10.34 (26.53%) | 8.63 (22.16%) |
2009 | 41.72 | 11.91 (28.55%) | 7.84 (18.80%) |
2014 | 54.78 | 10.69 (19.52%) | 17.16 (31.34%) |
2019 | 60.74 | 11.94 (19.67%) | 22.90 (37.70%) |
2024 | 64.20 | 13.63 (21.30%) | 23.45 (36.60%) |