- మన ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారు: మోదీ
- సార్వత్రిక ఎన్నికలు.. మన ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ: మోదీ
- మన ఎన్నికలను ప్రపంచదేశాలు ఎంతో ఉత్సాహంతో చూశాయి: మోదీ
- ఈ దేశంలోని ప్రతి ఓటరుకూ అభినందనలు: మోదీ
- ఈ ఎన్నికల వల్లే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది: మోదీ
- 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదు: మోదీ
- రాష్ట్రాల్లో ఎన్డీఏకు గొప్ప విజయం దక్కింది: మోదీ
- ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలో చరిత్ర సృష్టించాం: మోదీ
- ఒడిశాలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుంది: మోదీ
- పూరీ జగన్నాథుడి ఆశీర్వాదంతో ఒడిశాలో విజయం దక్కింది: మోదీ
- పేదప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నాం: మోదీ
- తెలంగాణలో మా సీట్లు రెండింతలు పెరిగాయి: మోదీ
- మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, దిల్లీలో దాదాపు క్లీన్‌స్వీప్ చేశాం: మోదీ
- ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు: మోదీ
- ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించాం: మోదీ
- మేం రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు: మోదీ
- 2014కు ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవి: మోదీ
- వికాస్.. నినాదంతోనే మేం మూడుసార్లు అధికారంలోకి వచ్చాం: మోదీ
- మా సేవలు చూసే ప్రజలు మూడోసారి పట్టం కట్టారు: మోదీ
- దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు: మోదీ
- ఈసారి మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొని గత రికార్డులు తిరగరాశారు: మోదీ
- 12 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించాం: మోదీ
- 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించాం: మోదీ
- దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తాం.. ఆ దిశగా అడుగులు వేస్తాం: మోదీ
- మేం చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతి పథంలో పయనిస్తోంది: మోదీ
- మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకెళ్తోంది: మోదీ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు- ప్రజలంతా గర్వపడుతున్నారు: మోదీ - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
Published : Jun 4, 2024, 6:48 AM IST
|Updated : Jun 4, 2024, 9:00 PM IST
LIVE FEED
- దేశ రాజకీయాల్లో ఎన్డీఏ చరిత్ర సృష్టించింది: జేపీ నడ్డా
- మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తున్నాం: నడ్డా
- స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదు: నడ్డా
- దేశాభివృద్ధి కోసం ప్రజలు ఎన్డీఏకు మరోసారి పట్టం కట్టారు: నడ్డా
- ఒడిశాలో భాజపా సర్కారు ఏర్పాటు చేస్తున్నాం: నడ్డా
- బంగాల్‌లో మాకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు: నడ్డా
- బంగాల్‌లో ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చామో గమనించాలి: నడ్డా
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇది భారత దేశ చరిత్రలో చారిత్రక విజయమని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిని వరుసగా మూడోసారి గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత దశాబ్ద కాలంగా వారి కోసం చేసిన పనులను కొనసాగిస్తామని తెలిపారు.
- బంగాల్ బెహరంపుర్‌లో క్రికెటర్ యూసఫ్ పఠాన్ విజయం
- కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌నేత శశిథరూర్ విజయం
- యూపీలోని అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఓటమి
- పంజాబ్ ఖడూర్ సాహిబ్‌లో అమృత్‌పాల్ సింగ్ విజయం
- హిమాచల్‌ప్రదేశ్ హమీర్‌పుర్‌లో అనురాగ్ సింగ్ ఠాకుర్ విజయం
- గుజరాత్ గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్‌షా ఘనవిజయం
- కర్ణాటక ధార్వాడలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విజయం
- కర్ణాటక షిమోగాలో యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర విజయం
- జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో ఒమర్ అబ్దుల్లా ఓటమి
- జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజైరీలో మహబూబా మఫ్తీ ఓటమి
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ ఈసీని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. "మధ్యాహ్నం 2:30 తర్వాత ఈసీ వెబ్‌సైట్‌లలో ఫలితాలు అప్‌డేట్ చేయడంలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర యూనిట్లు, అభ్యర్థుల నుంచి మాకు నివేదిక అందింది. మేం ఎలాంచి ఆరోపణలు చేయలేదు. కేవలం అప్డేట్లు ఇవ్వమని కోరాం" అని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.
- కర్ణాటక హవేరీలో బసవరాజ్ బొమ్మై విజయం
- కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌నేత శశిథరూర్ విజయం
- కర్ణాటక మాండ్యలో జయకేతనం ఎగువేసిన జేడీఎస్ నేత కుమారస్వామి
- ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయం
- కేరళ వయనాడ్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజయం
- హిమాచల్‌ప్రదేశ్ మండిలో కంగనా రనౌత్ జయకేతనం
- జలందర్‌లో లక్ష75 వేల ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ విజయం
- కర్ణాటకలోని హాసనలో ఎన్డీయే కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి
- కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్ చేతిలో 43వేల ఓట్ల తేడాతో పరాజయం
- మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలపై ఇటీవల అరెస్టయిన ప్రజ్వల్
లోక్‌సభ ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే నరేంద్ర మోదీకి రాజకీయంగా, నిర్ణయాత్మకంగా నైతిక ఓటమి అని, ఆయన రాజీనామా చేసి హిమాలయాలకు వెళ్లాలని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించలేదు.
మరోవైపు, ఎన్డీఏ మిత్రపక్షాలతో టచ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా స్పందించారు. తెర వెనుక జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని బహిరంగపరచలేమని చెప్పారు. "మేం టార్గెట్‌ను 295 సీట్లుగా పెట్టుకున్నాం. అన్నీ సవ్యంగా జరిగితే 295కి చేరుకుంటాం. ఫలితాలు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న విశ్వాసంతో ఉన్నాం" అని తెలిపారు.
కర్ణాటక హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఘోర ఓటమి దిశగా వెళ్తున్నారు. ప్రజ్వల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్. ఎం పటేల్ 43,719 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
- మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఆధిక్యంలో నితిన్ గడ్కరీ
- కర్ణాటక ధార్వాడలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధిక్యం
- రాజస్థాన్ జాలౌర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వైభవ్ గెహ్లాత్ వెనకంజ
- ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో అధిక్యంలో నిలిచిన కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ఝార్ఖండ్ ఖూంటిలో వెనకంజలో కేంద్రమంత్రి అర్జున్‌ముండా
- పశ్చిమ త్రిపురలో భాజపా అభ్యర్థి త్రిపుర మాజీ సీఎం బిప్లబ్ కుమార్ 5లక్షల 70 వేల ఓట్ల ఆధిక్యం
- బంగాల్ బహరంపుర్‌లో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వెనుకంజ
- తిరువనంతపురంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ ముందజ
- ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్‌పుర్‌లో వెనుకంజలో ఉన్న బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ
- బంగాల్ అసన్‌సోల్‌లో నటుడు శత్రుఘ్నసిన్హా ఆధిక్యం
- గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రమంత్రి అమిత్ షా హవా
- తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3లక్షలకు పైగా ఆధిక్యంలో దూసుకెళ్తున్న అమిత్ షా
కేరళలోని తిరువనంతపురంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్
పంజాబ్ ఖాదూర్ సాహిబ్‌లో ఖలిస్థానీ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ 45వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యం
ఒడిశా సంబల్‌పుర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆధిక్యం
- కర్ణాటక హసన్‌లో ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యం
మహారాష్ట్ర బారామతిలో సుప్రీయ సూలే ఆధిక్యం
హిమాచల్ ప్రదేశ్ హమీర్‌పూర్‌లో 50వేల ఓట్ల ఆధిక్యంలో అనురాగ్ ఠాకూర్
- యూపీ: రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యం
- యూపీ: 26 వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ
వారణాసిలో స్వల్ప ఆధిక్యంలో ప్రధాని నరేంద్రమోదీ
- ఉత్తర్‌ప్రదేశ్‌లో అమేఠిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ
- కర్నాల్ నుంచి హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెనుకంజ
- మహారాష్ట్ర అమరావతిలో సినీ నటి నవనీత్ కౌర్ రాణా వెనుకంజ
- కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌నేత శశిథరూర్ ఆధిక్యం
- బంగాల్ బహరంపుర్‌లో కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత ఆధీర్ రంజన్ చౌదరి ఆధిక్యం
- కేరళ త్రిశూర్‌లో నటుడు సురేశ్ గోపీ ఆధిక్యం
- జమ్ముకశ్మీర్ బారాముల్లాలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వెనుకంజ
- కేరళ అలప్పుజలో కేసీ వేణుగోపాల్ ఆధిక్యం
- తమిళనాడు రామనాథపురంలో పన్నీర్ సెల్వం వెనుకంజ
- తమిళనాడు కోయంబత్తూర్‌లో అన్నామలై వెనుకంజ
- కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌నేత శశిథరూర్ వెనుకంజ
- కర్నాల్ నుంచి హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్ రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆధిక్యం
- తమిళనాడు తుత్తుకుడిలో కనిమెుళి ఆధిక్యం
- తమిళనాడు శివగంగలో కార్తీ చిదంబరం ఆధిక్యం
- ఒడిశా సంబల్‌పుర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆధిక్యం
- ముంబయి నార్త్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆధిక్యం
- రాజస్థాన్ కోటలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధిక్యం
- ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆధిక్యం
- మధ్యప్రదేశ్ గుణలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆధిక్యం
- మహారాష్ట్ర అమరావతిలో సినీ నటి నవనీత్ కౌర్ ఆధిక్యం
- హవేరిలో కర్ణాటక మాజీ సీఎం బస్వరాజ‌్ బొమ్మై ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధిక్యం
- జమ్ముకశ్మీర్ బారాముల్లాలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధిక్యం
- అరుణాచల్‌ప్రదేశ్ పశ్చిమలో కిరణ్‌రిజిజు ఆధిక్యం
బారామతిలో సునేత్ర పవార్ అధిక్యం
- మధ్యప్రదేశ్ గుణాలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- మహారాష్ట్ర బారామతిలో సునేత్ర పవార్ ఆధిక్యం
- మహారాష్ట్ర అమరావతిలో సినీ నటి నవనీత్ కౌర్ ఆధిక్యం
- దక్షిణ బెంగళూరు నుంచి బీజేపీ నేత తేజస్వి సూర్య ఆధిక్యం
- హవేరిలో కర్ణాటక మాజీసీఎం బస్వరాజ‌్ బొమ్మై ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధిక్యం
- జమ్ముకశ్మీర్ బారాముల్లాలో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆధిక్యం
ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది: అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి
"భారత పార్లమెంటు చరిత్రలో 2024 జూన్ 4 కీలక రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేయనున్నాయి. ప్రధాని మోదీ మరోసారి ఆ పదవిని అలంకరించబోతున్నారు" - అర్జున్ రామ్ మేఘవాల్, కేంద్ర మంత్రి
దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్‌లో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మైన్‌పూరీలో SP చీఫ్ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ లీడ్‌లో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటకలోని మండ్యాలో మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్ర బారామతిలో సుప్రియా సూలే, మధ్యప్రదేశ్‌లోని విదిశాలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. బంగాల్ డైమండ్ హర్బర్‌లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లీడ్‌లో కొనసాగుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ స్థానంలో కంగనా రనౌత్ వెనుకంజలో ఉన్నారు.
సంబరాలకు బీజేపీ ఏర్పాట్లు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ అభిమాన పార్టీల కోసం పూజలు నిర్వహిస్తున్నారు. బిహార్‌లోని పట్నాలో బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ హోమం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో విజయోత్సవ సంబరాలు జరుపుకొనేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు 201 కిలోల లడ్డూలను ఆర్డర్ చేశారు. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పూరీలు , స్వీట్లు సిద్ధం చేస్తున్నారు. న్యూదిల్లీ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్థి, బన్సూరి స్వరాజ్ దిల్లీలోని శ్రీ లక్ష్మీ నారాయణ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వారణాసిలో నరేంద్ర మోదీ అధిక్యం
- విదిశాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యం
- మహారాష్ట్ర బారామతిలో సుప్రీయ సులే ఆధిక్యం
- కర్ణాటక మండ్యలో ఆధిక్యంలో మాజీ సీఎం కుమారస్వామి
- మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఆధిక్యంలో నితిన్‌గడ్కరీ
- గాంధీనగర్‌లో అమిత్‌షా ఆధిక్యం
- హమీర్‌పూర్‌లో అనురాగ్ ఠాకూర్ ఆధిక్యం
- వారణాసిలో ఆధిక్యంలో మోదీ ముందంజ
- హిమాచల్ ప్రదేశ్ మండిలో కంగనా రనౌత్ ఆధిక్యం
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మైన్‌పురిలో అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్
- దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
- దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంల్లో పోలైన ఓట్లు లెక్కింపు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల మోహరింపు
- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు
- ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా విజేత నిర్ణయం
పటిష్ఠ భద్రత మధ్య లెక్కింపు ప్రారంభం
అఖిల భారత రాజకీయ కురుక్షేత్రంలో విజేతలెవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్న కౌంటింగ్ సిబ్బంది అరగంట తర్వాత ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లను గణించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో జరిగిన హింస దృష్ట్యా ప్రతి లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
Lok Sabha Election Results 2024 Live Updates :సుధీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. 542 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు విడతల్లో పోలింగ్ జరగ్గా ఆ ఫలితాల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు సూరత్ లోక్‌సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైంది. ఈ నేపథ్యంలో 542లోక్‌సభ స్థానాలకే పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత EVMలలో పోలైన ఓట్లను గణిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలు, ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు.
దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 75 జిల్లాలోని 81 లెక్కింపు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. మహారాష్ట్రలో 48లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా 289 కౌంటింగ్ హాళ్లు, 4 వేల 309 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులో 39లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 39 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు 52 జిల్లాల్లో కౌంటింగ్‌కు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 29 కేంద్రాల్లో లెక్కించనున్నారు. గుజరాత్‌లో ఏకగ్రీవమైన సూరత్ మినహా 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపును 26 కేంద్రాల్లో చేపడతారు. కేరళలోని 20 స్థానాల ఓట్లను లెక్కించేందుకు 20 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అసోంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను 52 కేంద్రాల్లో లెక్కిస్తారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాల ఓట్లను లెక్కించేందుకు 117 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిపుణులంతా బీజేపీ నేతృత్వంలోని NDA కూటమికే మళ్లీ అధికారం దక్కుతుందని అంచనా వేస్తుండగా ఇదివరకు పెద్దగా ప్రభావం చూపని రాష్ట్రాల్లోనూ గెలుపు రికార్డు రాస్తామని NDA ధీమాతో ఉంది. అటు ప్రతిపక్షాలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు.