Lok Sabha Election 2024 Schedule Change :లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేసింది ఎలక్షన్ కమిషన్. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింలో కౌంటింగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 2వ తేదీకి మార్చింది. ఈ మేరకు ఈసీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మిగతా షెడ్యూల్ మొత్తం యాథావిధిగా ఉంటుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన ఎన్నికలకు జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది.
CUET షెడ్యుల్‌లో మార్పు లేదు
మే 15, మే 31న జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. అయితే మొదట సీయూఈటీ పరీక్ష తేదీలు లోక్‌సభ ఎన్నికల వల్ల మారే అవకాశం ఉందని భావించినా, ముందుగా ప్రకటించిన తేదీల్లోనే నిర్వహించాలని యూజీసీ నిర్ణయించింది.
2024 సార్వత్రిక ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే
- మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు
- ఏప్రిల్ 19, 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న పోలింగ్
- 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు
- నాలుగు రాష్ట్రాల్లో రెండు విడతల్లో ఎన్నికలు
- కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపుర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
- ఛత్తీస్‌గఢ్, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు
- ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతల్లో ఎన్నికలు
- మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు విడతల్లో ఎన్నికలు
- యూపీ, బిహార్, బంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు