Lok Sabha Election 2024 CRPF : లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం 3.40 లక్ష మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఆర్ఫీఎఫ్) అవసరమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం(ఈసీ) పంపిన ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ బలగాలను మోహరించాలని నిర్ణయించుకుంది.
అత్యధికంగా బంగాల్‌కు
లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎంత మంది సిబ్బంది కావాలనేదానిపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు పంపిన ప్రతిపాదనలను ఈసీ కేంద్ర హోంశాఖకు పంపింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడం కోసం 3.40 లక్షల మంది సిబ్బంది కావాలని కోరింది. అలానే ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్స్, లెక్కింపు కేంద్రాల భద్రత వంటి విధుల్లో సిబ్బందిని నియమించాలని కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో ఎన్నికల సంఘం పేర్కొంది. గరిష్ఠంగా బంగాల్‌కు 920 కంపెనీల బలగాలను కావాలని ఈసీ కోరింది. ఒక్కో కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు.
వివిధ రాష్ట్రాలకు బలగాలు
జమ్ముకశ్మీర్‌లో 635, ఛత్తీస్‌గఢ్ 360, బిహార్‌లో 295, ఉత్తర్‌ప్రదేశ్‌లో 252, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 295 గుజరాత్, మణిపుర్, రాజస్థాన్, తమిళనాడు ఒక్కో రాష్ట్రానికి 200, ఒడిశాలో 175, అసోం, తెలంగాణలో 160 కంపెనీల బలగాలు అవసరమని లేఖలో పేర్కొంది ఈసీ. మహారాష్ట్రలో 150, మధ్యప్రదేశ్‌లో 113, త్రిపురలో 100, హరియాణాలో 95, అరుణాచల్ ప్రదేశ్‌లో 75, కర్ణాటక, ఉత్తరాఖండ్, దిల్లీకి 70, కేరళలో 66, లద్దాఖ్‌లో 57, హిమాచల్ ప్రదేశ్‌లో 55, నాగాలాండ్‌లో 48, మేఘాలయలో 45, సిక్కింలో 17, మిజోరంలో 15 కంపెనీల బలగాల అవసరమని తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీలో 14, గోవాలో 12, చండీగఢ్‌లో 11, పుదుచ్చేరిలో 10, అండమాన్ నికోబార్‌లో 5, లక్షద్వీప్‌లో 3 కంపెనీలు కావాలని లేఖలో పేర్కొంది. ఈసీ కోరిన విధంగా బలగాలను మోహరించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.
'ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్, చర్చలు ఫలించేనా?