Karnataka Teacher Murder Case Update : కర్ణాటకలోని మేలుకోటెలో ప్రైవేట్ స్కూల్ టీచర్ దీపిక హత్యోదంతంలో కీలక విషయాలను పోలీసులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. హత్య కేసు నిందితుడు నితేశ్, దీపిక కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ షార్ట్ వీడియోలు చేసేవారని పోలీసుల విచారణలో తెలిసింది. దీపికకు తరచూ రీల్స్ చేయడం వ్యసనంగా మారిందని, దీంతో భర్త చాలా సార్లు ఆమెను మందలించినట్లు పోలీసులు తెలిపారు. సక్రమంగా ఉద్యోగం చేస్తూ 8 ఏళ్ల కుమారుడ్ని బాగా చూసుకోవాలని భర్త లోకేశ్ ఆమెకు హితవు చెప్పేవారని వివరించారు. ఈ మేరకు దీపిక హత్యకేసులో కీలక వివరాలను వెల్లడించారు.
ప్రేమికుల్లా ఇన్స్టాలో రీల్స్?- అలా చేయనందుకే స్కూల్ టీచర్ దీపికను చంపేశాడట! - Karnataka Teacher Murder Case
Karnataka Teacher Murder Case Update : కర్ణాటకలో మేలుకోటె యోగనరసింహ స్వామి కొండ వెనుక భాగంలో హత్యకు గురైన ప్రైవేటు స్కూల్ టీచర్ దీపిక కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు నితేశ్‌తో కలిసి దీపిక తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేదని తెలిసింది. తనను దూరం పెడుతోందన్న కక్ష్యతోనే దీపికను హత్య చేసినట్లు నితేశ్ విచారణలో అంగీకరించినట్లుగా కర్ణాటక పోలీసులు వివరించారు.
Published : Jan 25, 2024, 7:23 PM IST
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
28ఏళ్ల దీపికకు స్థానికంగా ఉండే 22 ఏళ్ల నితేశ్‌తో రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి రీల్స్ చేసేవారని తన భార్యతో ఇలాంటి వీడియోలు చేయద్దని నితేశ్‌ను కూడా దీపిక భర్త హెచ్చరించాడని తెలిసింది. అక్క అక్క అంటూ పిలుస్తూ దీపికకు నితేశ్ దగ్గరయ్యాడని విచారణలో వెల్లడైంది. ఈ మధ్యకాలంలో దీపికను తాను అసభ్యకరంగా తాకగా ఆమె తనను అడ్డుకుని హెచ్చరించిందని నితేశ్ అంగీకరించాడు. ప్రేమికుల్లా రీల్స్ చేద్దామని చాలాసార్లు దీపికపై ఒత్తిడి తెచ్చినట్లు అంగీకరించాడు. ఆమె అందుకు ఒప్పుకోక పోగా తనను దూరం పెడుతూ వచ్చిందని తెలిపాడు.
చున్నీతో ఉరిబిగించి దారుణహత్య చేసిన నిందితుడు
గత శనివారం పాఠశాల ప్రైవేట్ స్కూల్ టీచర్ దీపిక నుంచి విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో నితేశ్‌ను దీపిక యోగనరసింహస్వామి కొండ వద్ద కలుసుకుంది. అక్కడే చున్నీతో ఉరిబిగించి హత్య చేసి అనంతరం ఆ ప్రాంతంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు నితేశ్. రహదారి పక్కన స్కూటీ ఆగి ఉండటం, మట్టి తవ్వినట్లు ఉంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే హత్య విషయం వెలుగులోకి వచ్చింది. హత్య తర్వాత రెండు రోజుల పాటు ఆమె ఆచూకీ తెలియలేదని, ఆ సమయంలో దీపిక తండ్రికి నితేశ్ ఫోన్ చేసి అక్క దొరికిందా అని ఆరా తీసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.