Former Karnataka CM S M Krishna in ICU: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ(92) ఆస్పత్రిలో చేరారు. ఇటీవలె అనార్యోగంతో మణిపాల్ ఆస్పత్రిలో చేరిన ఆయన ప్రస్తుతం ఐసీయూలో చిక్సిత పొందుతున్నారని డాక్టర్లు తెలిపారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కృష్ణ ఏప్రిల్ 21న బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఏప్రిల్ 29న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. స్పెషలిస్ట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సునీల్ కారంత్ నేతృత్వంలోని క్రిటికల్ కేర్ టీమ్ చికిత్స అందిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సిద్ధరామయ్య పరామర్శ
ఈ క్రమంలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి కృష్ణ పలకరించారు. అలాగే ఆయనకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.