తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సండే స్పెషల్​ - "కాజు మష్రూమ్ మసాలా కర్రీ"- రైస్​లోకి​ మాత్రమే కాదు చపాతీల్లోకి సూపర్‌ కాంబినేషన్‌! - Kaju Mushroom Masala Recipe

Kaju Mushroom Masala Recipe : రెస్టరెంట్‌లలో చేసే కొన్ని రెసిపీలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటి వాటిలో కాజు మష్రూమ్‌ మసాలా కర్రీ ఒకటి. అయితే, ఈ సండే రోజున లంచ్​లోకి ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. మరి దీనిని ఎలా ప్రిపేర్​ చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..

Kaju Mushroom Masala
Kaju Mushroom Masala Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 9:23 AM IST

Updated : Jul 7, 2024, 9:50 AM IST

Kaju Mushroom Masala Curry Making Process : సండే వచ్చిందంటే చాలు ప్రతి వంటింట్లో నాన్‌వెజ్‌ వంటకాలు ఘుమఘుమలాడుతుంటాయి. అయితే, ఎప్పుడూ చికెన్‌, మటన్ వంటివి వండకుండా.. ఈ సారి పుట్టగొడుగులతో రెస్టరెంట్‌ స్టైల్‌లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ ట్రై చేయండి. ఒక్కసారి ఈ రెసిపీట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ దీనిని వండుకుంటారు. అంత బాగుంటుంది దీని టేస్ట్‌. చేయడం కూడా పెద్ద కష్టం కాదు. ఈజీగా ప్రిపేర్​ చేయొచ్చు. అంతేనా ఈ కర్రీతో రైస్​ మాత్రమే కాదు.. చపాతీ, పరాటా, రోటి.. ఇలా కాంబినేషన్​ ఏదైనా హిట్​ కావాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు :

గ్రేవీ కోసం

  • టమాటలు-3
  • చిన్న అల్లం ముక్క
  • జీడిపప్పు- పావు కప్పు(15 నిమిషాలు నానబెట్టుకోవాలి)
  • పచ్చిమిర్చి-3
  • వెల్లులి రెబ్బలు-4
  • యాలకలు-2
  • లవంగాలు-3
  • ఎండు మిర్చి-2
  • మిరియాలు-1/2 tsp
  • పెరుగు- 1/4 cup

కర్రీ కోసం:

  • మష్రూమ్స్ - 150 గ్రాములు
  • జీడిపప్పు - ముప్పావు కప్పు
  • నూనె - సరిపడా
  • ఉల్లిపాయ - 1
  • జీలకర్ర- 1 tsp
  • కారం-1/2 tsp
  • కశ్మీరీ కారం - 2 టీ స్పూన్లు
  • గరం మసాలా- 1/2 tsp
  • ధనియాల పొడి-1/2 tsp
  • ఉప్పు- సరిపడినంత
  • నీళ్లు - సరిపడా
  • నెయ్యి-1 tsp
  • కొత్తిమీర తరుగు
  • నిమ్మరసం - కొద్దిగా

సండే స్పెషల్​ - నోరూరించే ప్రాన్స్​ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా!

కాజు మష్రూమ్ మసాలా కర్రీ తయారీ విధానం :

  • ముందుగా గ్రేవీ కోసం మిశ్రమం ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం మిక్సీలో టమాటలను ముక్కలుగా కట్‌ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం ముక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, యాలకులు, లవంగాలు, మిరియాలు, నానబెట్టిన జీడిపప్పు, పావుకప్పు పెరుగు, ఎండుమిర్చి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌ ఆన్​ చేసి పాన్‌ పెట్టి ఆయిల్‌ వేసుకుని జీడిపప్పు వేసుకుని ఓ నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు సగానికి కట్‌ చేసుకున్న మష్రూమ్‌ వేసుకుని.. మష్రూమ్స్​, జీడిపప్పు లైట్‌ గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్ వచ్చే దాకా ఫ్రై చేయండి. తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టండి.
  • ఇప్పుడు అదే ఆయిల్‌లో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేంతవరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో కారం, కశ్మీరీ కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
  • తర్వాత ఇందులోకి గ్రైండ్‌ చేసుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి గ్రేవి చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి.
  • తర్వాత ఇందులోకి ఫ్రైడ్‌ కాజు, మష్రూమ్‌ వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు ఒక టేబుల్‌ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసుకుని సన్నని మంట మీద 3 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • స్టవ్​ ఆఫ్​ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే సరి. రెస్టరెంట్‌ స్టైల్‌ కాజు మష్రూమ్‌ కర్రీ రెడీ.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

నోరూరించే "వంకాయ దమ్​ బిర్యానీ" - ఇలా చేశారంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే!

Last Updated : Jul 7, 2024, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details