తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క చేతితోనే షూటింగ్ - 2 గంటల్లో 5వేల బుల్లెట్ల వర్షం - భారత జవాన్ల దెబ్బకు ఉగ్రవాదులు పరార్ - JK Encounter - JK ENCOUNTER

Jammu Kashmir Encounter : జమ్మూ, కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన నేపథ్యంలో భారత సైన్యం ప్రతిదాడులతో విరుచుకుపడ్డారు. గాయపడిన సైనికులను కాపాడేందుకు మిగతా జవానులు, ముష్కరులపై బల్లెట్ల వర్షం కురిపించారు. దీనితో తోకముడిచిన ఉగ్రవాదులు సమీపంలో అడవుల్లోకి పారిపోయారని సంబంధిత అధికారులు తెలిపారు.

Kathua Terror Attack
jammu kashmir encounter (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 7:40 PM IST

Jammu Kashmir Encounter :జమ్మూకశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన సమయంలో భారత సైన్యం ప్రతిదాడులతో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. గాయపడిన సైనికులను కాపాడుకునేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. రెండు గంటల పాటు జవాన్లు, ముష్కరులకు చుక్కలు చూపించారనీ, ఏకంగా 5 వేలకు పైగా రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. సైనికుల తెగువతో తోక ముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు.

తోక ముడిచిన ఉగ్రవాదులు!
జమ్మూకశ్మీర్‌ కఠువా జిల్లాలోని మాచేడీలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సమయంలో భారత సైన్యం ధీటుగా బదులిచ్చిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ముష్కరులు వేర్వేరు చోట్ల నక్కి కాల్పులు జరుపుతుండగా, గాయపడ్డ సైనికులను రక్షించుకోవడంతో పాటు మరింత ప్రాణ నష్టం వాటిల్లకుండా మిగతా జవాన్లు జాగ్రత్త పడ్డారని చెప్పారు. ఈ క్రమంలో భారత సైన్యంలోని '22 గడ్వాల్‌ రెజిమెంట్‌' దాదాపు 5,189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో తోకముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు సమాచారం.

తీవ్రగాయాలైనా పోరాటం ఆపలేదు!
కఠువాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నోతా గ్రామ సమీపంలోని మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో సోమవారం రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎదురు కాల్పులు జరిపారు. అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంత తీవ్రమైన ఒత్తిడిలోనూ భారత జవాన్లు మరింత ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ముష్కరులను నిరోధించడంతోపాటు, ఆయుధాలను ఎత్తుకెళ్లకుండా తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు నిరంతరంగా కాల్పులు కొనసాగించారు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ, తన ఆయుధం జామ్‌ అయ్యే వరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించారని తెలుస్తోంది.

సైనికుల త్యాగాలు వృథా కావు!
ఉగ్ర దాడికి సంబంధించిన విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఘటనా స్థలంలో రక్తంతో తడిసిన హెల్మెట్లు, పగిలిన వాహనాల టైర్లు, రక్షణ కవచాలను పరిశీలించారు. వాటిని చూస్తే, ఏ స్థాయిలో పోరు జరిగిందో స్పష్టంగా అర్థమవుతుందని ఓ అధికారి పేర్కొన్నారు. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య రెండు గంటలకుపైగా కాల్పులు జరిగాయన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు వేర్వేరు ప్రదేశాల్లో దాక్కొని సైనిక వాహనాలు, బలగాలే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. సైనికుల త్యాగాలు వృథా కావని, ఘాతుకానికి పాల్పడిన వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని రక్షణ శాఖ ఇప్పటికే పేర్కొంది.

అనాథ యువతికి గ్రాండ్​గా పెళ్లి చేసిన పోలీస్- వచ్చిన వారందరికీ రిటర్న్ గిఫ్ట్​గా మొక్క! - Unique Weddings

'మిస్టర్ సూర్య'గా మారిన మిస్ అనసూయ- రికార్డుల్లో జెండర్ మార్చుకున్న IRS- చరిత్రలో తొలిసారి - IRS Officer Name And Gender Change

ABOUT THE AUTHOR

...view details