తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నగల దుకాణంపై ఈడీ దాడులు- 30 గంటలు సెర్చింగ్​- రూ.116 కోట్ల విలువైన ఆస్తులు సీజ్​ - IT raids in Nashik - IT RAIDS IN NASHIK

IT raids on Surana Jewellers in Nashik : మహారాష్ట్రలోని నాసిక్​లోని ఓ నగల దుకాణం, ఆ షాపు యజమాని కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ.26కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను జప్తు చేశారు. ఇదంతా లెక్కల్లో చూపని నగదేనని ఐటీ అధికారులు తెలిపారు.

IT raids on Surana Jewellers in Nashik
IT raids on Surana Jewellers in Nashik (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 12:44 PM IST

Updated : May 26, 2024, 1:45 PM IST

IT raids on Surana Jewellers in Nashik : మహారాష్ట్ర నాసిక్​లోని సురానా జ్యువెల్లర్స్ దుకాణం, యజమాని కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఐటీ శాఖ అధికారులు. సురానా జ్యువెలర్స్‌ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడిందనే కారణంతో మే 23 సాయంత్రం నుంచి దాదాపు 30గంటలుగా ఐటీ శాఖ దాడులు నిర్వహించి భారీగా నగదును జప్తు చేసింది.

అసలేం జరిగిందంటే?
మే 23వ తేదీ సాయంత్రం ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌ మెంట్ డైరెక్టర్ జనరల్ సతీష్ శర్మ నేతృత్వంలో అధికారులు సురానా జ్యువెల్లర్స్, కార్యాలయంపైన దాడులు జరిపారు. నాసిక్, నాగ్‌ పుర్, జల్గావ్ బృందానికి చెందిన 50-55 మంది ఆ ఆపరేషన్​లో పాల్గొన్నారు. అదే సమయంలో రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే ప్రైవేట్ లాకర్లు, ఆయనకు పలు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. మన్మాడ్, నంద్​గావ్‌లో ఉన్న సురానా జ్యువెల్లర్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు.

ఐటీ సోదాల్లో సీజ్​ చేసిన నగదు (ETV Bharat)

అయితే, ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తొలుత కార్యాలయాలు, ప్రైవేట్ లాకర్లలో కొద్దిపాటి నగదు మాత్రమే దొరికింది. అదే సమయంలో సురానా జ్యువెల్లర్స్ యజమాని బంధువు విలాసవంతమైన బంగ్లాను తనిఖీ చేయగా అక్కడ లాకర్లలో కూడా డబ్బు కనిపించలేదు. ఈ క్రమంలో అధికారులకు అనుమానం వచ్చి బంగ్లాలో ఉన్న ఫర్నీచర్ ను బద్దలు కొట్టగా నగదు గుట్టలు గుట్టలుగా బయటపడింది. వెంటనే ఆ నగదును లెక్కించేందుకు సీబీఎస్ సమీపంలోని స్టేట్ బ్యాంకుకు వెళ్లగా శనివారం సెలవు కావడం వల్ల బ్యాంకు మూసి ఉంది. వెంటనే స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జ్యువెల్లర్స్ యజమాని బంధువు బంగ్లాలో జప్తు చేసిన నగదును దాదాపు 14గంటలపాటు శ్రమించి లెక్కించారు అధికారులు. అంతకుముందు జప్తు చేసిన నగదును ఏడు కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో పెట్టి తరలించారు.

సోదాల్లో సీజ్​ చేసిన నగదును లెక్కిస్తున్న అధికారులు (ETV Bharat)

ఏడాది మొత్తం కాసే మామిడి చెట్లు- తుపాను వచ్చినా రాలవట! విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్- కేజీ ధర? - Special Mango Tree in Rajasthan

పిల్లల​ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- ఏడుగురు నవజాత శిశువులు మృతి, మరో ఐదుగురు సీరియస్​ - fire accident at delhi

Last Updated : May 26, 2024, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details